శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2015 (09:10 IST)

నీట మునిగిన ఐటీ కారిడార్: బెంగళూరుకు తాత్కాలికంగా షిఫ్ట్!

తమిళనాడు రాజధాని చెన్నైలో ఐటీ కారిడార్ నీట మునిగింది. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని ఐటీ కారిడార్ మొత్తం నీట మునిగింది. ప్రముఖ ఐటీ కంపెనీలు యాక్సెంచర్, ఇన్ఫోసిస్ కార్యాలయాల్లోకి వరద నీరు చేరిపోయింది. దీంతో ఈ కార్యాలయాల్లో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 
 
పది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఐటీ కంపెనీలు తమ రోజువారీ కార్యకలాపాలను పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరుకు తాత్కాలికంగా షిఫ్ట్ చేశాయి. రోజువారీ కార్యకలాపాలతో పాటు చెన్నైలోని సిబ్బందిని కూడా ఐటీ కంపెనీలు బెంగళూరుకు తరలించనున్నట్లు సమాచారం.
 
చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెడ్ హిల్స్, చోళవరం, చెంబరంబాక్కం, పూండీ చెరువుల్లో నీటిమట్టం పెరగడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో తాగునీరు.. ఇతరత్రా అత్యావసర సౌకర్యాలు అందక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.