Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొడనాడు ఎస్టేట్‌లో హత్యలు.. దోపిడీలు.. 20 సీసీ కెమెరాలు, చెక్ పోస్టుల ఏర్పాటు..

శుక్రవారం, 12 మే 2017 (10:29 IST)

Widgets Magazine

కొడనాడు వేసవి విడిది కేంద్రానికి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం.. కొడనాడు ఎస్టేట్‌లో హత్యలు, దోపిడీలు జరిగిన నేపథ్యంలో కొడనాడు ఎస్టేట్‌కు భారీ భద్రత కల్పించే దిశగా.. 20 సీసీ కెమెరాలను, అన్ని మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అమ్మ బతికున్నంత వరకూ భద్రత వలయంలో ఉన్న ఎస్టేట్‌కు.. అమ్మ మరణానంతరం భద్రత తొలగిపోయింది. 
 
అదే అదనుగా వాచ్ మెన్‌ను హత్య చేసిన దుండగులు, అక్కడున్న విలువైన వస్తువులను, నగదును అపహరించుకుపోయారని వార్తలు సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు ఎస్టేట్ లోకి డ్రోన్ కెమెరాలను పంపి పరిసరాలను చూస్తున్నారని తెలియడంతో, మరేవైనా అనుమానాస్పద ఘటనలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక్కడి తేయాకు తోటల నుంచి రోజుకు వెయ్యి కిలోల వరకూ తేయాకు మాయం అవుతున్న అనుమానాలూ కలగడంతో, పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
 
ఈ క్రమంలో చెక్ పోస్టులను సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ వైపుగా ఏ వాహనం వెళ్లినా, వారి వివరాలు, వాహనం నంబర్లు, ప్రయాణిస్తున్న వారి పేర్లను నమోదు చేస్తున్నామని నీలగిరి ఎస్పీ మురళీ రంభ వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సీటు విషయంలో వాగ్వాదం... విమానం దిగేటప్పుడు ముష్టిఘాతాలు.. (Video)

సాధారణంగా మన ఆర్టీసీ బస్సుల్లో సీటు కోసం కొట్టుకోవడం, జుట్లుజుట్లు పట్టుకోవడం వంటి ...

news

3 అడుగుల గుంతలో ప్రాణాలతో ఉండగానే 19 ఏళ్ల యువతిని పూడ్చి పెట్టారు (Video)

తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ భవనాన్ని అడ్డుకున్నందుకు 19 యేళ్ళ ...

news

ప్రధానితో జగన్ భేటీ.. టీడీపీ వెన్నులో వణుకు... కాళ్ల మీద పడటం చూశారా : కావూరి ప్రశ్న

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న వైకాపా అధినేత వైఎస్. జగన్ ...

news

ప్రేమించవు సరే.. కనీసం పెళ్లి కూడా చేసుకోవా? రోజాపై ప్రేమోన్మాది దాడి...

సాఫ్ట్‌వేర్ టెక్కీపై ఓ ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ప్రేమను నిరాకరించడమే కాకుండా ...

Widgets Magazine