శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 3 జులై 2015 (12:29 IST)

హేమ మాలిని కారు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్... ప్రమాదానికి కారణం అదే...

విదేశీ కారు స్టీరింగ్ చేతిలో ఉంటే చాలు... కొందరు డ్రైవర్లు రోడ్డుపైన కార్లను విమానాల మాదిరి వేగంతో దూసుకుపోతుంటారు. ఇలాంటి అతివేగమే హేమమాలినిని రోడ్డు ప్రమాదానికి గురి చేసినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. దీంతో పోలీసులు హేమమాలిని డ్రైవర్ రమేష్ చంద్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మెర్సిడెజ్ బెంజ్ కారును డ్రైవ్ చేసిన అతడు ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు గాను ఐపీసీ 279, బాధ్యతారాహిత్యంగా కారును నడిపినందుకు సెక్షన్ 304(ఎ) కింద కేసులు నమోదు చేశారు.
 
కాగా నిన్న రాత్రి బీజేపీ ఎంపీ హేమ మాలిని రాజస్థాన్, జైపూర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రాజస్థాన్లోని దౌసా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్లి మరో కారు ఢీకొనడంతో ఆమె గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది.