గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (14:26 IST)

అమ్మాయిని అక్కడ పట్టుకున్నారో.. హై ఓల్టేజ్ షాక్... ఎక్కడ?

ఆ.. అమ్మాయే కదా.. అక్కడ పట్టుకుని ఓ టీజింగ్ చేద్దాం... కుదిరితే అత్యాచారం చేద్దామని ఆకతాయిలు ప్రయత్నం చేశారో.. హై ఓల్టేజీ షాక్ కొడుతుంది. ఆ పవర్ 3,800 కిలోవాట్లుంటుదట. బిత్తరపోయి పరుగులు పెట్టాల్సిందే. చెన్నైకు చెందిన యువతి ఇలా బ్రా ఒకదానిని తయారుచేసింది. వివరాలిలా ఉన్నాయి. 
 
సమాజంలో పెరుగుతున్న అత్యాచారాలను దృష్టిలో పెట్టుకుని అమెరికాలో మిట్‌ మీడియా ల్యాబ్‌లో చదువుతున్న మనీషా మోహన్ ఓ బ్రాను రూపొందించింది. ఇది మహిళలకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది.  ఆమె రూపొందించిన ఈ బ్రాను తాకిన వారికి 3,800 కిలోవాట్ల విద్యుత్‌ షాక్‌ కొడుతుంది. 
 
అంతేకాదు.. ఇందులో అమర్చిన జీపీఎస్‌ సహాయంతో సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు ఒక సందేశం పంపే వ్యవస్థ కూడా ఉంది. ఇటీవలే ఆమె రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముందు దీని పనితీరును ప్రదర్శించి ఆయన ప్రశంసలు కూడా పొందింది.