శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (12:58 IST)

మహిళా జడ్జికి లైంగిక వేధింపులు.. హిమాచల్ ప్రదేశ్ జడ్జి సస్పెండ్!

మహిళలపై జరిగే నేరాలు, ఘోరాల, లైంగిక దాడులు వంటి కేసుల్లో కీలక తీర్పులను వెలువరించే న్యాయమూర్తే ఓ మహిళా జడ్జిని లైంగికంగా వేధించి సస్పెండ్‌కు గురయ్యాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచోసుకోగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... గత నెల 8వ తేదీన మనాలి హిల్ స్టేషన్‌లో మాదకద్రవ్యాలపై ఓ సదస్సు జరిగింది. దీనికి ట్రయల్ కోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. వీరిలో ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. 
 
మనాలి హిల్ స్టేషన్‌కు వెళ్లిన తర్వాత మహిళా జడ్జిని ఓ రిసార్టుకు రమ్మని న్యాయమూర్తి బలవంతం చేసినట్టు సమాచారం. దీనిపై రాష్ట్రానికి తిరిగివచ్చాక ఆ బాధిత మహిళా జడ్జి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదుచేశారు. దీంతో సదరు న్యాయమూర్తిని సస్పెండ్ చేసిన సీజే రెండు నెలల్లోగా పూర్తి విచారణ జరిపి నివేదిక తనకివ్వాలని పోలీసులను ఆదేశించారు.