గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (15:34 IST)

గాడ్సేకు దేశ వ్యాప్తంగా పాలరాతి విగ్రహాలు : హిందూ మహాసభ

నాథూరామ్ గాడ్సేకు దేశ వ్యాప్తంగా విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్ట హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు చంద్రప్రకాష్ కౌశిక్ వెల్లడించారు. ఇప్పటికే రూ.17 వేల వ్యయంతో పాలరాతి విగ్రహ ప్రతిమను తయారు చేసినట్టు ఆయన తెలిపారు. 
 
ఢిల్లీలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ ఒకటి లేదా రెండు రోజుల్లో గాడ్సే ప్రతిమలను ఏర్పాటు చేసేందుకు తగిన స్థలం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఎంతో మంది హిందువులను చంపిన ఔరంగ జేబు పేరు మీద మన దేశంలో రోడ్లు ఉన్నాయని, అలాంటప్పుడు నాథూరాం గాడ్సే ప్రతిమలను ఎందుకు నిలబెట్టకూడదన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనకు నిరాకరిస్తే, తామే అన్ని రాష్ట్రాల్లోని హిందూ మహాసభ కార్యాలయాల్లో గాడ్సే ప్రతిమలు ఏర్పాటు చేస్తామన్నారు. నాథూరాం గాడ్సే పాలరాయి ప్రతిమ సెంట్రల్ ఢిల్లీలోని మందిర్ మార్గ్‌లో ఉన్న తన ఆఫీసులో ఒక మూల ఉందని చెప్పారు. ఈ పాలరాతి ప్రతిమను రాజస్థాన్‌లోని కిషన్‌గడ్‌లో తయారు చేయించినట్టు చెప్పారు. ఈ ప్రతిమ ఖర్చు రూ.17,000లని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే జనవరి 30, 1948న కాల్చి చంపిన విషయం తెల్సిందే.