శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (09:37 IST)

మూడు శాతం తగ్గిన హిందూ జనాభా.. కారణమేంటి? : గణాంకాలతో కేంద్రం వెల్లడి

హిందూ దేశంలో హిందూ ప్రజల జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. అదేసమయంలో ముస్లింల జనాభా పెరుగుతోంది. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. గత నాలుగు దశాబ్దాల కాలంలో హిందువుల సంఖ్య పెరిగినా శాతం పరంగా చూసినప్పుడు

హిందూ దేశంలో హిందూ ప్రజల జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. అదేసమయంలో ముస్లింల జనాభా పెరుగుతోంది. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. గత నాలుగు దశాబ్దాల కాలంలో హిందువుల సంఖ్య పెరిగినా శాతం పరంగా చూసినప్పుడు మాత్రం మూడు శాతం తగ్గినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ జి.అహిర్ లోక్‌సభకు తెలిపారు. 
 
1971లో 82.7 శాతం ఉన్న హిందూ జనాభా 2011 నాటికి 79.8 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారం 45.33 కోట్లుగా ఉన్న హిందువుల సంఖ్య 2011 నాటికి 96.62 కోట్లకు చేరుకున్నట్టు మంత్రి వివరించారు. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.