శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2016 (11:35 IST)

కళ్లు తెరిచిన సీఎం జయలలిత... ధ్రువీకరించిన అపోలో వైద్యులు...

సుదీర్ఘ కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మెల్లగా కోలుకుంటున్నారు. గత మూడు వారాలుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఆమె ఆరో

సుదీర్ఘ కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మెల్లగా కోలుకుంటున్నారు. గత మూడు వారాలుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఆమె ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాలైన వదంతులు వస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ పరిస్థితుల్లో జయలలిత కళ్లు తెరిచారన్న వార్త ఆసుపత్రి ముందు రోజుల తరబడి వేచి చూస్తున్న అమ్మ అభిమానులు, రోజుల తరబడి వేచి చూస్తున్న ప్రజల్లో ఒక్కసారిగా ఆనందం పెల్లుబికింది. ఈ వార్తలను వైద్యులు సైతం ధ్రువీకరించారు. ఆమె కళ్లు తెరచి చూసిందని వైద్యులు స్పష్టం చేయడంతో, ఆమె మరింత త్వరగా కోలుకోవాలని ఓ వైపు ప్రత్యేక పూజలు చేస్తూనే, మరోవైపు సంబరాలను మొదలు పెట్టారు అమ్మ అభిమానులు. 
 
దీంతో అపోలో ఆసుపత్రి ఎదుట సందడి పెరిగింది. మరోవైపు నేడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, జయలలితను పరామర్శించేందుకు రానున్నారు. జయలలిత కళ్లు తెరిచారన్న వార్తల నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం వైద్యులు విడుదల చేసే బులెటిన్‌పై ఆసక్తి నెలకొంది. మరోవైపు... జయలలితకు వైద్యం చేసేందుకు ఎయిమ్స్ వైద్యులతో పాటు... లండన్‌కు చెందిన డాక్టర్ రిచర్డ్ బిలేలు మరోమారు చెన్నైకు రానున్నారు.