Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దినకరన్‌కు పార్టీ పదవి... చీలిక దిశగా అన్నాడీఎంకే ... పన్నీర్ సారథ్యంలో అమ్మ డీఎంకే

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (13:01 IST)

Widgets Magazine
ttv dinakaran

అన్నాడీఎంకే అడుగులు చీలిక దిశగా పడుతున్నాయి. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్ నేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో అన్నాడీఎంకే ఆధిపత్య, అధికార పోరు తారా స్థాయికి చేరుకున్న విషయంతెల్సిందే. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోయారు. 
 
కాగా, అన్నాడీఎంకేను డీఎంకే నుంచి వైదొలిగిన ఎంజీఆర్ 1972లో స్థాపించారు. ఆయన మరణించిన తర్వాత కూడా దిగ్విజయంగా కొనసాగింది. దివంగత జయలలిత దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు పార్టీని ఏకఛత్రాధిపత్యంగా నడిపించారు. అలాంటి అన్నాడీఎంకే ఇప్పుడు చీలిక దిశగా అడుగులు వేస్తోంది. తనకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో, సీఎం అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామిని శశికళ ప్రతిపాదించడం పార్టీలో చాలా మందికి నచ్చడం లేదు.
 
పళనిస్వామిపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యక్తిని సీఎంగా చేస్తే, పార్టీ పరువు పోతుందని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు సమాచారం. అమ్మకు అత్యంత విధేయుడు, మచ్చలేని మనిషి పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందని కొంతమంది ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
 
దీంతో పాటు.. జయలలిత పోయెస్ గార్డెన్‌తో పాటు... పార్టీ నుంచి గెంటేసిన వారందరినీ తన బంధువులకు... పార్టీలో కీలక పదవులను శశికళ కట్టబెట్టడం చాలా మందికి మింగుడు పడటం లేదు. పోయస్ గార్డెన్ నుంచి జయ తరిమేసిన తన మేనల్లుడు టిటివి.దినకరన్‌కు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ కట్టబెట్టారు. ఇది చాలా మందికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలిపోనుందనే సంకేతాలు అందుతున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పోయెస్ గార్డెన్ నుంచి శశి చుట్టాలందరూ వెళ్ళిపోండి.. దీపతో పన్నీర్ రెఢీ.. చిన్నమ్మ కసి తీర్చుకుంటుందా?

చిన్నమ్మ శశికళ జైలుకెళ్లిపోయింది.. ఇక ఆపద్ధర్మ సీఎంగా పన్నీర్ సెల్వం పనికానిస్తున్నారు. ...

news

అధికారంలోకి డీఎంకే వస్తుందా..? ఎమ్మెల్యేలతో స్టాలిన్ భేటీ ఎందుకు.. పన్నీర్‌కు కన్నీరేనా?

తమిళనాట రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ...

news

ప్రేయసికి కొత్త కారు.. ఆపై దానిని 2వేల రూపాయలతో అలకరించాడు.. కానీ జైలుకెళ్లాడు..

ప్రేమికుల రోజున ఓ ప్రేమికుడు ప్రియురాలికి మదిలో నిలిచిపోయే కానుక ఇవ్వాలనుకుని ...

news

అమ్మ సమాధిపై శశి ''శపథం'': పన్నీర్ సెల్వమే టార్గెట్.. సీఎం పదవి కూడానా? ఏమై వుంటుంది?

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల తీర్పుతో జైలు శిక్ష ...

Widgets Magazine