శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (17:04 IST)

పెరిగిన హెచ్ఐవీ భీతి... కండోమ్‌ల కొరత..!

హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధుల భీతితో కండోమ్‌ల వాడకం ఎక్కువైంది. దీంతో దేశంలోని ఆరు రాష్ట్రాలలో కండోమ్‌ల కొరత ఏర్పడినట్లు సమాచారం. అయితే కండోమ్‌ల వాడకం పెరిగినా, అదే స్థాయికి సరఫరా జరగకపోవడంతోనే కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో కండోమ్స్ కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నట్లు సమాచారం. 
 
ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూడా కండోమ్స్ వాడుకడం అత్యధిక స్థాయిలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో హర్యానా, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాధి రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలలో గత ఎనిమిది నెలలుగా కండోమ్స్ కొరత సమస్య ఏర్పడి ఉన్నట్లు తెలిసింది. కండోమ్‌ల పంపిణీలో ఆలస్యంగా కారణంగా ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది.
 
నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(నాకో) అధికారులు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శిని కలిసి ఈ విషయాన్ని వివరించారు. కండోమ్స్ తోపాటు హెచ్ఐవి టెస్టింగ్ కిట్ల కొరత కూడా ఉందని అధికారులు చెప్పారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను కలిగి ఉన్న దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉండడం గమనార్హం.