గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (14:40 IST)

గోమూత్రంలో బంగారం దాగుందట.. యాంటిబయోటిక్‌‌తో పాటు పలు ఔషధ గుణాలు కూడా?!

గోమూత్రం సకల దోషాలను దరిచేరదని పంచాంగ నిపుణులు అంటుంటే వింటుంటాం. అలాంటి గోమూత్రంలో నుంచి బంగారం ఉన్నట్లు గుజరాత్‌లోని జునాగఢ్ అగ్రికల్చర్ యూనివర్శిటీ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. గోమూత్రంలో బంగా

గోమూత్రం సకల దోషాలను దరిచేరదని పంచాంగ నిపుణులు అంటుంటే వింటుంటాం. అలాంటి గోమూత్రంలో బంగారం ఉన్నట్లు గుజరాత్‌లోని జునాగఢ్ అగ్రికల్చర్ యూనివర్శిటీ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. గోమూత్రంలో బంగారం దాగుందనే సంచలన విషయాన్ని పరిశోధకులు కనుగొనడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 
 
గోమూత్రం నుంచి ఔషధాలను తయారు చేసే విషయం తెలిసిందే. అయితే తాజాగా గోమూత్రంలో పసిడి నమూనాలున్న విషయం వెలుగులోకి రావడంతో అందరూ షాక్ తిన్నారు. గోవును తాకితేనే పాపాలు హరించిపోతాయని అందరూ విశ్వసిస్తారు. కానీ గోమూత్రంలో బంగారం దాగుందని, గిర్ జాతి ఆవుల మూత్రంపై గుజరాత్‌‌లోని జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. 
 
400 గిర్ ఆవుల నుంచి సేకరించిన మూత్రం నమూనాల ఆధారంగా జేఏయూలోని ఆహార పరీక్ష ల్యాబ్‌లో ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో అయాన్ల రూపంలో గోమూత్రంలో బంగారం ఉన్నట్టు పరిశోధకులు వెల్లడించారు. గేదెలు, గొర్రెలు, మేకలు, ఒంటెల మూత్రనమూనాల్లో యాంటీ బయోటిక్ పదార్థాలు కనిపించలేదు. కానీ గోమూత్రంలో బంగారంతో పాటు పలు ఔషధ గుణాలను కూడా తాను కనుగొన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.