శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 మే 2017 (10:08 IST)

ట్రిపుల్ తలాక్ ఇస్లాం మతంలో అంతర్భాగం కాదు..

ట్రిపుల్ తలాక్ అంశం ఇస్లాం మతంలో అంతర్భాగం కాదని.. ఇది ఇస్లాం సమాజంలోని అంతర్గత సంఘర్షణ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ముస్లిం స్త్రీల ప్రాథమిక హక్కులను హరిస్తూ వారిని సామాజిక

ట్రిపుల్ తలాక్ అంశం ఇస్లాం మతంలో అంతర్భాగం కాదని.. ఇది ఇస్లాం సమాజంలోని అంతర్గత సంఘర్షణ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ముస్లిం స్త్రీల ప్రాథమిక హక్కులను హరిస్తూ వారిని సామాజికంగా కుంగదీసే అంశం ద్వారా వారి హక్కులకు భంగం కలుగుతున్నందున ఈ అంశంపై న్యాయపరమైన అతి విశ్లేషనాత్మక మర్రె సూక్ష్మ పరిశీలన జరగాలని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ బుధవారం ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి తెలిపారు.
 
తలాక్‌తోపాటు ముస్లిం మత వివాహాలపై నియంత్రణ తెస్తూ ప్రభుత్వం చట్టం ఎందుకు తీసుకురాలేదని కోర్టు ప్రశ్నించింది. కోర్టు ట్రిపుల్ తలాక్ కేసును కొట్టేస్తే.. కేంద్రం చట్టం చేస్తారా? గత 69 ఏళ్లుగా ఎందుకు చట్టం తీసుకురాలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులతో పాటు ఇస్లాం మూలసూత్రాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని ట్రిపుల్ తలాక్‌ను సమర్థిస్తున్న సీనియర్ న్యాయవాదులను ముకుల్ రోహత్గీ కోరారు.