శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (11:42 IST)

కేజ్రీవాల్.. మీరు డమ్మీ... పెత్తనమంతా లెఫ్టినెంట్ గవర్నర్‌‌దే : ఢిల్లీపై హోంశాఖ వివరణ

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ), ఢిల్లీ ముఖ్యమంత్రికి గల అధికారాలపై కేంద్ర హోంశాఖ శుక్రవారం వివరణ ఇచ్చింది. తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం విషయంలో ఢిల్లీ ఎల్జీ, సీఎంల మధ్య రాజుకున్న వివాహం చివరకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న విషయం తెల్సిందే. దీంతో కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది.
 
 
ఢిల్లీలో అధికారులను పోస్టింగ్ చేయడం, బదిలీలు, తొలగింపు వంటి అధికారాలు గవర్నరుకు ఉన్నాయని, ఈ విషయంలో ముందస్తు సమాచారాన్ని ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 
 
ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు, శాంతి భద్రతలు, పోలీస్, భూములు తదితర విషయాలు ఆయన పరిధిలోనివేనని స్పష్టం చేసింది. ప్రభుత్వం ముందస్తు నిర్ణయం తీసుకున్నప్పటికీ.. తుది నిర్ణయం మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్‌దేనని స్పష్టం చేసింది. కాగా, ఢిల్లీలో గవర్నరు అధికారాలను అడ్డంపెట్టుకుని కేంద్రం తమపై పెత్తనం సాగిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే.