Widgets Magazine

హనీప్రీత్ సింగ్ అల్లర్లకు అంతించ్చిందా? 17సిమ్‌లు వాడిందా? ఐరాస ట్వీట్ సంగతేంటి?

ఆదివారం, 8 అక్టోబరు 2017 (17:11 IST)

honeypreet

సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చిన సమయంలో చోటుచేసుకున్న అల్లర్లకు డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్‌ కారణమని పోలీసులు తేల్చి చెప్పారు. కాగా అక్కడ అల్లర్లు చేసేందుకు హనీప్రీత్‌ రూ.1.25కోట్లు ఖర్చుచేసినట్లు వారు తెలిపారు. ఆగస్టు 25న తేదీన పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్‌ను దోషిగా తేల్చింది. విచారణ సమయంలో భారీగా డేరాబాబా అనుచరులు, భక్తులు అలర్లకు ఒడిగట్టారు.  
 
ఈ హింసాత్మక ఘటనల్లో 30 మందికిపైగా మృతిచెందారు. తాజాగా జరిపిన విచారణలో ఈ అల్లర్లకు కారణం మాస్టర్‌మైండ్‌ హనీప్రీతేనని పోలీసులు తెలిపారు. కస్టడీలో ఉన్న గుర్మీత్‌ వ్యక్తిగత సిబ్బంది, డ్రైవర్‌ రాకేశ్‌ కుమార్‌ను విచారించగా ఈ విషయాలను వెల్లడించినట్లు చెప్పారు. 
 
కోర్టు తీర్పుకు రెండు రోజుల ముందు పంచకుల డేరా బ్రాంచ్‌ హెడ్‌కు హనీప్రీత్‌ రూ.1.25కోట్లు ఇచ్చినట్లు విచారణలో తేలిందన్నారు. అందుకు సంబంధించి ఆన్‌లైన్‌ నగదు బదిలీ వివరాలు కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అయితే అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అమాయకురాలినని హనీప్రీత్‌ మీడియాకు చెప్తున్నారు. అలాగే డేరా బాబా అరెస్టు అనంతరం 38 రోజులు అజ్ఞాతంలో ఉన్న హనీప్రీత్ అన్ని రోజుల్లో 17 సిమ్‌లు ఉపయోగించిందని తేలింది.
 
ఒక‌ప‌క్క‌ అత్యాచారం కేసులో శిక్ష అనుభ‌విస్తూ గుర్మీత్ బాబా, నెల‌న్న‌ర త‌ర్వాత పోలీసుల‌కు ప‌ట్టుబ‌డి హ‌నీప్రీత్‌లు దేశంలో వార్త‌ల్లో నిలుస్తుంటే, ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌ల‌ర‌క్ష‌ణ విభాగం వారు త‌మ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్లో ఓ ట్వీట్ చేశారు. ''డియ‌ర్ హ‌నీప్రీత్‌... మీరూ, గుర్మీత్ బాబా క‌లిసి ప్ర‌పంచ మ‌రుగుదొడ్డి దినోత్స‌వం సంద‌ర్భంగా మాతో గొంతు క‌లుపుతార‌ని ఆశిస్తున్నాం" అనేది ట్వీట్ సారాంశం.
 
దీన్ని బ‌ట్టి చూస్తే ఐక్య‌రాజ్య‌స‌మితి ట్విట్ట‌ర్ అకౌంట్‌ను చూసుకునే వారికి బాబా, హ‌నీప్రీత్‌ల ప్ర‌స్తుత ప‌రిస్థితి గురించి అవ‌గాహ‌న లేన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. రకరకాలుగా ట్వీట్లు చేస్తున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Honeypreet Panchkula Violence Sim Cards Gurmeet Ram Rahim Singh

Loading comments ...

తెలుగు వార్తలు

news

రెండుసార్లు పెళ్లిచేసుకున్నారు.. అయితే భర్తకు షాక్ ఇచ్చింది.. ఎలా?

ఓ యువతి ఏడాది వ్యవధిలోనే ఒకే వ్యక్తిని రెండుసార్లు పెళ్లి చేసుకుంది. ఈ ఘటన గుజరాత్‌లో ...

news

పొత్తులపై నోటికొచ్చినట్లు వాగకండి: చంద్రబాబు వార్నింగ్.. తలసాని ఎందుకొచ్చారు?

ఏపీ సీఎం చంద్రబాబుతో టి.టిడిపి నేతల భేటీ ముగిసింది. పొత్తులపై వ్యక్తిగత వ్యాఖ్యలు ...

news

రాజకీయాల్లోకి వస్తే తమిళనాడుకు మంచే చేస్తారు: లతా రజనీకాంత్

తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతికి తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. రజనీకాంత్ ...

news

డొనాల్డ్ ట్రంప్ అక్రమ సంబంధం.. అందుకే తొలి భార్య విడాకులు తీసుకుంది..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి భార్య ఆయన అక్రమ సంబంధం గురించి ఓ పుస్తకంలో ...

Widgets Magazine