శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2017 (09:11 IST)

ఓటేసే ముందు ఒక్కసారి ‘అమ్మ’ను తలచుకోండి.. ఎమ్మెల్యేలకు పన్నీర్ పిలుపు

తమిళనాడులో ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి సారథ్యంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం శనివారం బలపరీక్షను ఎదుర్కోనుంది. అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన తిరుగుబాటుతో ఆ పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెల్సిందే.

తమిళనాడులో ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి సారథ్యంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం శనివారం బలపరీక్షను ఎదుర్కోనుంది. అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన తిరుగుబాటుతో ఆ పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెల్సిందే. దీంతో కొత్త ముఖ్యమంత్రిగా శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ప్రభుత్వం 15 రోజుల్లో మెజార్టీని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. దీంతో తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష జరుగనుంది. 
 
ఈ నేపథ్యంలో తిరుగుబాటు నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఓ పిలుపునిచ్చారు. విశ్వాస పరీక్షా సమయంలో ‘అమ్మ’ను గుర్తుకు తెచ్చుకుని ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు జయలలితను చూసే అన్నాడీఎంకేకు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. కుటుంబ పాలనకు జయ పూర్తిగా వ్యతిరేకమన్నారు. ఓటేసే ముందు అమ్మను గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు. 
 
రాష్ట్రాన్ని ఓ మాఫియా కుటుంబ పాలన నుంచి రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే ‘అమ్మ’ ప్రభుత్వానికి, నమ్మిన ప్రజలకు ద్రోహం చేసినట్టు అవుతుందన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా ఓటేస్తారని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. కాగా, విశ్వాస పరీక్షలో కనుక పళనిస్వామి నెగ్గితే కనుక రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజా కోర్టులో ఎమ్మెల్యేలను నిలబెట్టేందుకు పన్నీర్ సిద్ధమవుతున్నారు.