శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2015 (16:09 IST)

తప్పును అంగీకరించేందుకు 27ఏళ్లు.. సరిదిద్దుకోవడానికి ఎన్నేళ్లు?: రష్దీ

మాజీ ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలపై కేంద్ర మంత్రి పి చిదంబరం చేసిన వ్యాఖ్యలను స్వాల్మన్ రష్దీ తప్పు బట్టారు. ప్రముఖ రచయిత సాల్మన్ రష్దీ రాసిన ది శటానిక్ వర్సెస్ పుస్తకాన్ని నిషేధించి, ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ తప్పు చేశారని మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై రష్దీ స్పందిస్తూ... "తప్పును అంగీకరించేందుకు 27 సంవత్సరాలు పట్టింది. ఇక దాన్ని సరిదిద్దుకునేందుకు ఎంత కాలం పడుతుంది?" అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. 
 
కాగా, ఈ వివాదాస్పద పుస్తకం 1988లో విడుదలైంది.  ఓ ఇరాన్ మత పెద్ద అయాతుల్లా కొమెన్ని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి రష్దీని హత్య చేయాలంటూ ఫత్వా జారీ చేయడంతో ఎన్నో దేశాలు పుస్తకంపై నిషేధం విధించాయి. ఈ నిషేధాన్ని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టించాయి.