Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నైటీ వ్యక్తితో భార్య అక్రమ సంబంధం... నైటీ విప్పి చూసిన భర్తకు షాక్...

సోమవారం, 9 జనవరి 2017 (17:07 IST)

Widgets Magazine
love

మహారాష్ట్రలోని పుణేలో ఓ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాడు. అక్రమ సంబంధంతో స్నేహితుడి భార్యను లొంగదీసుకున్నాడు పదే పదే మహిళ వేషంతో ఇంటికొచ్చేవాడు. ఇలా ఓ రోజు భర్త ఉన్నాడని తెలిసినా.. ఆడ వేషంలో వచ్చి బుక్కైపోయాడు. వివరాల్లోకి వెళితే.. పుణెలోని బిబ్వేవాడి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఓ బంగ్లాలో నివాసముంటున్నాడు. అతనికి మెహతా అనే ఫ్రెండ్ ఉన్నాడు. మెహతా పదేపదే అతని ఇంటికి వెళుతుండేవాడు. అతని లేని సమయంలో కూడా ఇంటికి వెళుతుండేవాడు.
 
ఈ విషయాన్ని సెక్యూరిటీ ఇంటి యజమానికి విషయం చేరవేశాడు. దీంతో తన భార్యకు, మెహతాకు మధ్య అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న ఆ భర్త తన ఇంటికి వస్తే మర్యాదగా ఉండదని మెహతాను అనేక సార్లు హెచ్చరించాడు. అయినా మెహతా వ్యవహార శైలిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇరుగుపొరుగు వారు గమనిస్తున్నారని తెలుసుకుని వేషం మార్చాడు. ఆడదానిలా కనిపించే విధంగా దుస్తులు ధరించేవాడు. ఆమె ఇంటికి వెళ్ళేవాడు. ఇలా వెళ్లే క్రమంలోనే మెహతాకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆమె భర్త ఇంట్లో ఉండగా మెహతా వెళ్లాడు. తనతో పాటు తీసుకెళ్లిన మత్తు మందును నిద్రిస్తున్న ఆమె భర్త ముక్కు దగ్గర పెట్టాడు.
 
అయితే ఆ మత్తు మందు విపరీతమైన వాసన రావడంతో అతనికి మెలకువ వచ్చింది. తీరా లేచి చూసేసరికి ముసుగు వేసుకున్న మనిషి కనిపించాడు. మెహతా ఆమె భర్త ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. తప్పించుకుని పారిపోయే క్రమంలో మెహతా నైటీలో ఉన్నాడని తేలిపోయింది. వెంటనే అతడిని పట్టుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరికి క్షణిక సుఖాల కోసం పాకులాడిన అతని జీవితం కటకటాల పాలైంది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు రాజేష్ మెహతాను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రజలు బీఫ్ తింటే ప్రభుత్వానికి ఎందుకు..? హలాల్ బీఫ్‌ను తినేందుకు నేను ఇష్టపడతా: ఓవైసీ

ఇండియా టుడే దక్షిణాది సదస్సు-2017లో చాలామంది సెలెబ్రిటీలు అత్యున్నత న్యాయస్థానాన్ని ...

news

ట్రంప్ యాక్టింగ్ చూసి నా గుండెల్లో కత్తి దించినట్లు ఫీలయ్యా: 'ఆస్కార్' నటి మెరిల్ స్ట్రీప్

ట్విట్టర్‌లో ఇప్పుడిదే చర్చ... హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్... ఇలా ఒక్కరేమిటి ప్రపంచమంతా ...

news

విమానంలో పాము... ఆకుపచ్చని రంగులో వేలాడుతూ కనిపించింది.. సర్వీస్ రద్దు..

విమానాల్లో పాములు కనిపించడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. 2016 నవంబర్‌లో ఏరోమెక్సికో విమానం ...

news

జగన్‌కు బుర్ర లేదు.. అది రైతు భరోసా యాత్ర కాదు బురద యాత్ర: భూమా నాగిరెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి గోడదూకిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి.. ...

Widgets Magazine