శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2015 (08:41 IST)

గోవు ఎవరికీ తల్లి కాదు.. ఆవు మాంసం తింటే తప్పేంటి : మార్కండేయ ఖట్జూ

గోవు ఎవరికీ తల్లి కాదని, అసలు ఆవుకు ఎలాంటి ప్రత్యేకతలు లేని సాధారణ జంతువు, అందువల్ల గోమాంసం తింటే తప్పేంటని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ మార్కండేయ ఖట్జూ ప్రశ్నించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఢిల్లీ శివారు ప్రాంతమైన దాదరీతో పాటు ఆవు మాంసం సంఘటనపై స్పందించారు. ఆవు ఎవరికీ తల్లి కాదు... కానేరదు. అది ఒక మామూలు జంతువు. గోవుకు ఎలాంటి ప్రత్యేకతలు లేవన్నారు. 
 
పైగా, నేను ఆవు మాంసం తినాలనుకుంటే తింటాను. గతంలోనూ తిన్నాను. మున్ముందు కూడా తింటాను. నన్ను ఎవరు ఆపుతారు అంటూ ప్రశ్నించారు. ప్రపంచమంతటా గొడ్డుమాసం అనేక మంది తింటుంటారు. వారంతా చెడ్డవారా? మన దేశంలో ఆవు మాంసం తినని వారంతా సాధువులు, యోగులు, సన్యాసులా అని ప్రశ్నించారు. ఇలాంటి అర్థంపర్థం లేని కట్టుబాట్లు ఆంక్షల వల్లే అనర్థాలు సంభవిస్తున్నాయని పేర్కొంటూ దాదరీ సంఘటన రాజకీయ ప్రేరేపిత చర్యగా ఆయన అభివర్ణించారు.