Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మోడీని దేశ ప్రధానిగా చేసి పశ్చాత్తాప పడుతున్నా : రాంజెఠ్మలానీ

మంగళవారం, 8 మే 2018 (08:33 IST)

Widgets Magazine

ప్రధాని నరేంద్ర మోడీపై రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సీనియర్ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ మండిపడ్డారు. మోడీని దేశ ప్రధానిగా చేసినందుకు తాను ఇపుడు పశ్చాత్తాప పడుతున్నట్టు చెప్పుకొచ్చారు. మోడీ కోసం తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించానని, ఇపుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందని వ్యాఖ్యానించారు.
ram jethmalani
 
ఆయన బెంగుళూరులో విలేకరులతో మాట్లాడుతూ, నరేంద్ర మోడీని ప్రధానిగా చేసేందుకు తన అమూల్య సమయాన్ని వెచ్చించానని, ఇందుకు పశ్చాత్తాప పడుతున్నట్టు చెప్పారు. మోడీ ప్రధాని అయినా దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ కలగడం లేదన్నారు.
 
ముఖ్యంగా, గత ఎన్నికల సమయంలో విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న రూ.90 లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి, ప్రతి సామాన్యుడి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తానని మోడీ హామీ ఇచ్చారని, కానీ, ప్రధాని అయ్యాక ఈ హామీనే పూర్తిగా విస్మరించారన్నారు. పైగా, మోడీ ప్రధాని అయ్యాక జరిగిన ఎన్నికల్లో పీకల్లోతు అవినీతిలో కూరుకుని జైలుపాలైన వారందరికీ బీజేపీ టికెట్లు ఎలా ఇచ్చారు? ఇవేనా మీ నైతిక రాజకీయాలు?.. అని జెఠ్మలానీ నిలదీశారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆడబిడ్డల జోలికొస్తే సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరుస్తాం : చంద్రబాబు హెచ్చరిక

ఆడబిడ్డల జోలికి వస్తే సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరుస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ...

news

సమాఖ్య పరిరక్షణకే ఆర్థిక మంత్రుల సమావేశం... కేంద్రంపై టార్గెట్...

అమరావతి: సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసమే ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ...

news

టిడిపి - బిజెపి గొడవలోకి వేంకటేశ్వరుడిని లాగుతున్నారు.. ఎందుకు...?

గత ఎన్నికల్లో కలిసి పోటీచేసి, నాలుగేళ్లు కలిసి ప్రభుత్వాలు నడిపి, ఇటీవలే తెగదెంపులు ...

news

ప్రేమ వివాహం.. భర్తతో విబేధాలు.. అందంగా.. ఒంటరిగా.. వుండటంతో?

ప్రేమించి వివాహం చేసుకుంది. అందంగా వుండటంతో యాంకరింగ్ చేసేది. భర్తతో కలిసి మ్యూజికల్ ...

Widgets Magazine