శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 నవంబరు 2016 (11:52 IST)

అఖిలేష్‌ను బాధపెట్టడం ఇష్టంలేదు... నా మనసు గాయపడింది... నేతాజీ మాటే నాకు వేదం : అమర్ సింగ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను బాధపెట్టడం తనకు ఇష్టంలేదనీ, కానీ నా సహనాన్ని మించిన అవమానాలు ఎదురయ్యాయి. నా మనసు గాయపడిందని ఎస్పీ నేత అమర్ సింగ్ అన్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను బాధపెట్టడం తనకు ఇష్టంలేదనీ, కానీ నా సహనాన్ని మించిన అవమానాలు ఎదురయ్యాయి. నా మనసు గాయపడిందని ఎస్పీ నేత అమర్ సింగ్ అన్నారు. 
 
ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, ఆయన మద్దతుదారులు తనను అవమానిస్తున్నారంటూ ఆయన మరోమారు ఆరోపించారు. దేనికైనా ఒక హద్దు ఉంటుందని, ఆ మేరకు మాత్రమే భరించగలమని, ఈ విషయంలో ఏం చేయమంటారో చెప్పండంటూ ఆయన సోమవారం పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌‌తో భేటీ అయ్యారు.
 
ఈ భేటీ అనంతరం అమర్ సింగ్ మాట్లాడుతూ... 'నాకు అఖిలేశ్‌‌ను బాధపెట్టడం ఇష్టం లేదు. కానీ నా సహనాన్ని మించిన అవమానాలు ఎదురయ్యాయి. నా మనసు గాయపడింది. నేను ములాయంతో మాట్లాడుతాను. కుమారుడిని కూడా కాదని నేరుగా నాకు మద్దతిచ్చిన వ్యక్తి ములాయం. ఆయన ఏది చెప్తే అదే చేస్తాను' అని అన్నారు. 
 
అవమానాలు ఎదురవుతున్న నేపథ్యంలో రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా ములాయంను గాయపరిచే ఏ చర్యలను తాను చేయబోనని ఆయన చెప్పారు. 'నేను అఖిలేశ్‌ తో ఉండకపోవచ్చు. కానీ ఎప్పటికీ ములాయంతోనే ఉంటాను. అయినప్పటికీ నేను ఎప్పుడు ఏం మాట్లాడినా అఖిలేశ్‌కు అనుకూలంగా మాట్లాడతాను. నేతాజీకి నేనేమిటో పూర్తిగా తెలుసు' అని ఆయన చెప్పారు.