Widgets Magazine

కరెన్సీ నోట్ల కష్టాలు... రూ.500తో వివాహం చేసుకున్న ఐఏఎస్‌ల జంట

బుధవారం, 30 నవంబరు 2016 (13:05 IST)

Widgets Magazine
ias marriage

దేశంలో కరెన్సీ కష్టాలతో అనేక పెళ్లిళ్లు రద్దు అవుతున్నాయి. మరికొన్ని పెళ్లిళ్లు తమ వద్ద ఉన్న చిన్నపాటి మొత్తంతోనే పూర్తి చేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో ఇద్దరు ఐఏఎస్‌లు కూడా ఉన్నారు. వీరి వివాహం కేవలం 500 రూపాయలతో పూర్తి చేసి ఔరా అనిపించుకోవడమే కాకుండా, ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మధ్యప్రదేశ్‌ కేడర్‌‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఆశిష్ వశిష్ట ప్రస్తుతం గోహాడ్‌‌లో ఎస్‌డీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పెళ్లి చేసుకున్న సలోని సిదానా విజయవాడలో ఎస్డీఎంగా పనిచేస్తున్నారు. 2013లో ఐఏఎస్ పరీక్షను పాసైన వీరిద్దరు ముస్సోరిలో శిక్షణ సమయంలో ప్రేమించుకున్నారు. దీంతో ఇటీవల తమ వివాహానికి సంబంధించి అనుమతి ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బింద్‌ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు.
 
దీంతో కోర్టు వారికి నవంబర్‌ 28వ తేదీని కేటాయించింది. ఈ నేపథ్యంలో కోర్టు వద్దకు వచ్చిన ఇరు కుటుంబాల సభ్యులు చట్టపరంగా చేయాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసుకొని వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కేవలం రూ.500తో వివాహం చేసుకుని పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. ఆ ఐదువందలు కూడా కోర్టు ఫీజుగా చెల్లించడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అన్ని థియేటర్లలో జాతీయగీతం ఆలపించాల్సిందే : సుప్రీంకోర్టు

దేశంలోని సినియా థియేటర్లలో విధిగా జాతీయ గీతం ఆలపించాల్సిందేనంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ...

news

పెద్దనోట్ల రద్దుపై రాందేవ్ మాట: చేదుమాత్రే.. కానీ ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యవంతమే

పెద్ద నోట్ల రద్దుపై ప్ర‌ముఖ యోగాగురు రామ్‌దేవ్ బాబా కూడా సానుకూలంగా స్పందించారు. ...

news

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మిచెల్లీ పోటీ చేయరు: ఒబామా క్లారిటీ

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన సతీమణి మిచెల్లీ ఒబామా రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ...

news

లాలూ భార్య అంత మాటన్నారే..? సుశీల్ కుమార్ మోదీకి వదినలాంటి దాన్ని.. పరాచికాలు ఆడరాదా?

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నితీష్ ...