శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (12:30 IST)

పెళ్లి ఖర్చు రూ.1000.. టీ పార్టీతో సరిపెట్టిన జంట.. అతిథులకు కప్పు టీ ఇచ్చి?

పెద్ద నోట్ల రద్దుతో వివాహాలకు డబ్బుల కొరత ఏర్పడింది. వివాహానికి తరలివచ్చిన అతిధులకు కప్పు టీ ఇచ్చి ఆ దంపతులు ఒక్కటైన వింత సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్నాలమ్ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది

పెద్ద నోట్ల రద్దుతో వివాహాలకు డబ్బుల కొరత ఏర్పడింది. వివాహానికి తరలివచ్చిన అతిధులకు కప్పు టీ ఇచ్చి ఆ దంపతులు ఒక్కటైన వింత సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్నాలమ్ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. వివాహాన్ని ఆడంబరంగా చేయాలనుకున్నా పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీ కొరత వల్ల తమ ప్రయత్నాన్ని విరమించుకొని టీపార్టీతో వివాహం అయిందనిపించారు.
 
అనవసర ఖర్చులు లేకుండా నిరాడంబరంగా టీపార్టీతో జరిగిన పెళ్లిని అతిధులు సైతం మెచ్చుకున్నారు. పెద్ద నోట్ల పుణ్యమా అంటూ రత్నాలమ్ పట్టణానికి చెందిన కపిల్ రాథోడ్, అంతిమ్ బాలల వివాహాన్ని నిరాడంబరంగా అతిధులకు కప్పు టీ ఇచ్చి జరిపారు. ఈ వధూవరులిద్దరూ శనివారం రత్నాలమ్ కోర్టులో రిజిస్టరు పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆదివారం రామమందిరంలో అతిధులను ఆహ్వానించి వారికి టీ ఇచ్చారు. వివాహ వేడుకలో టీ తాగిన అతిధులు నూతన దంపతులను ఆశీర్వదించారు.