ఎంపీలు, ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ప్రజలకివ్వాలి : వరుణ్ గాంధీ

సోమవారం, 13 నవంబరు 2017 (07:33 IST)

varun gandhi

పని చేయని, హామీలు నెరవేర్చని ఎంపీలు, ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ప్రజలకు ఇవ్వాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అభిప్రాయపడ్డారు. గౌహతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వారిని తొలగించే హక్కు ప్రజలకు ఇవ్వాలంటూ ఆయన సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. 
 
ఇందుకోసం 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని వరుణ్ సూచించారు. హామీలు నెరవేర్చని ప్రజా ప్రతినిధులను అభిశంసన తీర్మానం ద్వారా తప్పించే అవకాశం లభిస్తే 75 శాతం మంది ఎంపీలను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. 
 
ఇకపోతే, తన ఇంటి పేరు కనుక గాంధీ కాకపోయి ఉంటే 29 ఏళ్లకే తాను ఎంపీని అయి ఉండేవాడినని గుర్తు చేశారు. ఇంటి పేరు ఏదైనా ప్రజలందరికీ సమానహక్కులు లభించాలన్నదే తన అభిమతమన్నారు. అటువంటి దేశాన్నే తాను చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. దీనిపై మరింత చదవండి :  
Surname Gandhi Mp Varun Gandhi

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆవులను తరలిస్తున్నాడనీ చంపేశారు.. రాజస్థాన్‌లో దారుణం

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో మరోమారు గో సంరక్షణ పేరుతో ఓ వ్యక్తిపై ...

news

జీఎస్టీ తగ్గింపు వెనుక ప్రధాని మోడీ : రాజ్‌నాథ్‌

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కింద కొన్ని వస్తువులపై పన్ను తగ్గింపు వెనుక ప్రధానమంత్రి ...

news

పడవ ప్రయాణంలో విషాదం.. 16 మంది మృతి... విచారణకు ఆదేశం

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. సింపుల్‌ వాటర్‌ ...

news

ఏపీ అసెంబ్లీలో నాకు నిద్రొస్తోంది - బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు(వీడియో)

ఎప్పుడూ ఏదో ఒకవిధంగా వార్తల్లో ఉండే బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి అలాంటి పనే ...