గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (18:34 IST)

భార్యపై స్నేహితుడితో రేప్ చేయించిన భర్త.. ఈ దుర్మార్గం ఎక్కడ?

మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశంలో మహిళలకు భద్రత కరువైన తరుణంలో ఓ భర్త సభ్యసమాజం తలదించుకునే పని చేశాడు.  తాను నపుంసకుడని తెలిసీ.. సంతానం కోసం తన స్నేహితుడితో భార్యపై అత్యాచారానికి సహకరించాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.

రెండేళ్ల పాటు చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో తాను నపుంసకుడు కావడంతో.. ఇక లాభం లేదనుకుని స్నేహితుని సలహాతో ఈ నీచ పనికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళ వడకర సమీపంలోని విల్లిపల్లిలో నివసిస్తున్న దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికి రెండేళ్లైనా సంతానం కలగకపోవడంతో ఆ భర్త నపుంసకుడని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో తన బాధను స్నేహితుడికి చెప్పిన ఆ వ్యక్తి ... స్నేహితుడి సలహాతో భార్యపై రేప్‌కు సహకరించాడు. వేరొకరితో శారీరక సంబంధం ద్వారా సంతానం కలుగుతుందని స్నేహితుడు ఇచ్చిన సలహాతో పాటు తానే ఆ పనిచేసేందుకు రెడీ అనగానే... ఆ భర్త ప్లాన్ ప్రకారం భార్యను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశాడు. 
 
దీంతోపాటు భర్త ఎదుటే ఆ స్నేహితుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించగా.. భర్తే అడ్డుకుని రేప్‌కు సహకరించాడు. ఈ వ్యవహారాన్ని బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. దీంతో నడక్కవు పోలీసులు రంగంలోకి దిగి భర్తతో పాటు స్నేహితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు.