శ్వేతనాగు.. ఎర్రటి కళ్లు.. బెంగళూరులో అరుదైన పాము..

అరుదైన శ్వేతనాగు ఓ ఇంట కనబడింది. బెంగళూరులో ఈ అరుదైన దృశ్యాన్ని జనాలు తిలకించారు. అంతే భయాందోళనకు చెందిన కొందరు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని మథికెరె ప్రాంత

selvi| Last Updated: మంగళవారం, 10 జులై 2018 (13:39 IST)
అరుదైన శ్వేతనాగు ఓ ఇంట కనబడింది. బెంగళూరులో ఈ అరుదైన దృశ్యాన్ని జనాలు తిలకించారు. అంతే భయాందోళనకు చెందిన కొందరు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని మథికెరె ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి ఇంట్లోకి శ్వేతనాగు ప్రవేశించింది. పాము రాకను గమనించిన కుటుంబ సభ్యులు భయంతో బయటకు వచ్చేశారు. 
 
ఆపై అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. ఆపై పాములు పట్టే రాజేశ్ కుమార్.. ఆ పాములు అరుదైన శ్వేతనాగు అని గుర్తించాడు. అలాంటి పాములను ఇప్పటి వరకు దేశంలో 8 మాత్రమే గుర్తించినట్లు రాజేశ్ తెలియజేశారు. 
 
శ్వేతరంగు చర్మంతో.. ఎర్రటి కళ్లతో కూడిన ఈ పాము కనిపించడం అరుదని చెప్పాడు. ఈ పామును అల్బీనో కోబ్రా అంటారని.. దేశంలో మొట్టమొదటిసారిగా బెంగళూరులోనే గుర్తించినట్లు రాజేష్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా రాజేష్ తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  దీనిపై మరింత చదవండి :