బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2016 (15:19 IST)

అంత్యక్రియల కోసం వెయిటింగ్ లిస్టులో శవాలు...

ఉత్తర భారతదేశాన్ని వానలు, వరదలు ముంచెత్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎటు చూసినా కనుచూపు మేరలో నీరు దర్శనమిస్తోంది. దీంతో అన్ని ప్రాంతాలు నీట మునిగిపోయాయి.

ఉత్తర భారతదేశాన్ని వానలు, వరదలు ముంచెత్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎటు చూసినా కనుచూపు మేరలో నీరు దర్శనమిస్తోంది. దీంతో అన్ని ప్రాంతాలు నీట మునిగిపోయాయి. చివరకు శవ దహనాలకు కూడా తీవ్ర ఆంటంకం ఏర్పడింది. విద్యుత్ దహన వాటికలు కూడా నీట మునిగిపోయాయి. ఫలితంగా ఉత్తరభారతంలో అంత్యక్రియలు చేయడం కూడా కష్టంగా మారింది. 
 
సాధారణంగా ప్రతి మనిషి కాశీలో తుది శ్వాస విడిచి.. అక్కడే అంత్యక్రియలు జరిపించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తుంటారు. కానీ, అలాంటిది ఇప్పుడు అక్కడ అంత్యక్రియల కోసం శవాలు వెయిటింగ్ లిస్టులో వేచి చూడాల్సి వస్తోంది. అంత్యక్రియలకు పేరొందిన మణికర్ణికా ఘాట్‌తో పాటు దానికి దారితీసే వీధులన్నీ కూడా భారీ వరద నీటితో మునిగిపోయాయి. 
 
దీంతో ఎత్తుగా ఉన్న ప్లాట్‌ఫారాల మీద మాత్రమే శవ దహనాలు జరుగుతున్నాయి. అక్కడి వరకు మృతదేహాలను తీసుకెళ్లేందుకు బోట్లను అద్దెకు తీసుకోవాల్సి వస్తోంది. ప్రతిరోజూ ఇక్కడకు 75-100 మృతదేహాలు వస్తుంటాయని, కానీ ఇక్కడ ఒకసారి ఆరింటిని మాత్రమే దహనం చేయగలమని అక్కడి కాటికాపరి చెప్పారు. వీటిని కూడా షిప్టుల్లో దహనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఒక్కో శవం పూర్తిగా కాలడానికి కనీసం రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతుందని, అందువల్ల మిగిలిన శవాలఉ వెయిటింగ్ లిస్టులో ఉంచక తప్పడం లేదని తెలిపారు. శవాలను కాల్చడానికి ఉపయోగించే కట్టెల నుంచి మొత్తం అన్ని సామాన్ల రేట్లు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్లాట్‌ఫాం వరకు మృతదేహాలను తీసుకురావడానికి పడవల వాళ్లు వంద రూపాయలు వసూలు చేస్తున్నారు. కట్టెల వ్యాపారులు కూడా గడ్డుకాలమే ఎదుర్కొంటున్నారు.