Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ కారణాలతో బాధపడేవారు లోకం విడిచి వెళ్లొచ్చు : సుప్రీంకోర్టు

శుక్రవారం, 9 మార్చి 2018 (12:24 IST)

Widgets Magazine
passive euthanasia

కారుణ్య మరణాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక రూలింగ్ ఇచ్చింది. ఎప్పటికీ నయం కాని వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఈ లోకాన్ని త్వరగా విడిచి వెళ్లాలని భావించడం తప్పేమీ కాదని కూడా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. 
 
స్వచ్ఛంద మరణంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం అందుకు అనుమతించింది. నిజానికి ఈ పిటిషన్‌పై గతేడాది అక్టోబరు 11నే వాదనలు ముగించిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. తాజాగా శుక్రవారం దీనిపై తీర్పును వెల్లడించింది. అలాగే, స్వచ్ఛంద మరణంపై నియమ నిబంధనలను కేంద్రం తయారు చేసి, న్యాయస్థానానికి అందజేసింది. వీటిని పరిశీలించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం తీర్పును వెలువరించింది. 
 
విధిలేని పరిస్థితుల్లో గత్యంతరం లేక మరణించాలని భావించే వారికి వారు కోరిన అవకాశాన్ని దగ్గర చేయాలంటూ కీలక రూలింగ్ ఇచ్చింది. బతికేందుకు ఎటువంటి మార్గమూ లేదని అన్ని విధాలుగా తేలిపోయిన తర్వాత, స్వచ్ఛంద మరణాన్ని కోరుకునే హక్కు న్యాయమైన హక్కేనని పరిగణిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. పౌరులకు గౌరవంగా మరణించే హక్కు ఉందని అభిప్రాయపడ్డ న్యాయమూర్తులు, విధివిధానాలకు తగ్గట్టుగా వారు తమ కోరికను తీర్చుకోవచ్చని స్పష్టంచేశారు. 
 
అయితే అందుకు సదరు రోగుల కుటుంబసభ్యుల నుంచి అనుమతి ఉండాలని పేర్కొంది. వీరితో పాటు ఆ రోగి కోలుకోవడం సాధ్యం కాదని చెప్పిన వైద్యుల బృందం అనుమతి కూడా ఉండాలని సూచించింది. సజీవ వీలునామాను తీసుకుని రోగి కుటుంబసభ్యులు లేదా సన్నిహితులు హైకోర్టుకు వెళితే.. పరోక్ష కారుణ్యం అవసరమో లేదో నిర్ణయించేందుకు ఆ న్యాయస్థానం మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలని తెలిపింది. ఈ సందర్భంగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తీర్పును వెలువరిస్తూ.. అలాంటి రోగులకు గౌరవంగా చనిపోయే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అసాధారణ పరిణామం : ఒక్కటికానున్న కిమ్ జాంగ్ ఉన్ - డోనాల్డ్ ట్రంప్

ప్రపంచంలో ఓ అసాధారణ పరిణామం ఆవిష్కృతం కానుంది. రెండు భిన్న ధృవాలు ఏకం కానున్నాయి. అంటే ...

news

నాయుడూజీ ఎలా ఉన్నారంటూ ఆరంభం - అన్నీ సవ్యంగానే జరుగుతాయంటూ ముగింపు : బాబుకు మోడీ ఫోన్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. కేంద్ర ...

news

కిమ్ జాంగ్‌తో డొనాల్డ్ ట్రంప్ చర్చలు.. స్టెఫానీతో సంబంధం లేదన్న..?

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సై ...

news

బీజేపీతో టీడీపీ తెగదెంపులు.. జగన్‌కు క్లీన్‌చిట్...?

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ...

Widgets Magazine