గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 26 ఏప్రియల్ 2017 (04:39 IST)

భారత విప్లవ కేంద్రం నక్సల్బరీ గ్రామంలో అమిత్ షా ప్రచారం

భారత వివ్లవోద్యమానికి పురిటి గడ్డ ఆ గ్రామం, గత యాభై ఏళ్లుగా దేశంలో కొనసాగుతున్న సాయుధ విప్లవపోరాటం మొట్టమొదటిసారిగా ఇక్కడే రైతాంగ తిరుగుబాటుతో పురుడు పోసుకుంది. వ్యవస్థ వ్యతిరేక పోరాటానికి ఊపిర్లు వదిలిన ఆ గ్రామం పేరు నక్సల్బరీ. నక్సలైట్ అనే పదానికి

భారత వివ్లవోద్యమానికి పురిటి గడ్డ ఆ గ్రామం, గత యాభై ఏళ్లుగా దేశంలో కొనసాగుతున్న సాయుధ విప్లవపోరాటం మొట్టమొదటిసారిగా ఇక్కడే రైతాంగ తిరుగుబాటుతో పురుడు పోసుకుంది. వ్యవస్థ వ్యతిరేక పోరాటానికి ఊపిర్లు వదిలిన ఆ గ్రామం పేరు నక్సల్బరీ. నక్సలైట్ అనే పదానికి మూలం ఈ గ్రామమే. ఇక్కడి రైతాంగ తిరుగుబాటును ప్రేరణగా తీసుకున్నవారినే నక్సలైట్లు అంటున్నారు. ఇప్పుడది నక్సలైట్ల గ్రామం కాదు. ఎందుకంటే అక్కడ అమిత్ షా ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పశ్చిమ బెంగాల్ స్థానిక ఎన్నికల కోసం నక్సల్‌బరి గ్రామం నుంచి ‘మిషన్‌ బంగాల్‌’ పేరుతో ప్రచారం మొదలుపెట్టారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడుతూ.. ‘మీరంతా చాలా పెద్దగా అరవండి. అప్పుడే కోల్‌కతా దాకా వినబడుతుంది. ఎక్కడైతే ఘర్షణలు జరిగాయో.. ఇప్పుడక్కడ కమలం వికసించడం ఆనందంగా ఉంది. ఎప్పుడైనా హింసపై అభివృద్ధి గెలవాల్సిందే’నని షా చెప్పుకొచ్చారు. బహిరంగ సభ అనంతరం అమిత్‌షా నక్సల్‌బరిలో ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారు.
 
మూడు రోజుల పర్యటనలో భాగంగా.. అమిత్‌షా భవానీపూర్‌లోనూ పర్యటించనున్నారు. ఇది బంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. వచ్చే ఏడాది స్థానిక ఎన్నికలు, 2019లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బంగాల్‌లో తన పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు చేపడుతోంది భాజపా.