Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వీడియో పిచ్చి.. కళ్లముందు మనిషి కాలిపోతున్నా పట్టించుకోలేదు.. సజీవంగా?

శుక్రవారం, 12 మే 2017 (15:38 IST)

Widgets Magazine
student fire

సెల్ఫీలు, వీడియోల పిచ్చి ప్రస్తుతం బాగా ముదిరిపోతుంది. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మనుషుల్లో మానవత్వం మంట కలిసిపోతోంది. కళ్లముందు తోటి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. అతనిని రక్షించకుండా వీడియో చూసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపైనే చాలామంది దృష్టి పెడుతున్నారు. అలాంటి చేదు ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బీద్‌ జిల్లా ప్రధాన జాతీయ రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని, ఒక బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలైనాయి. ప్రమాదం ధాటికి మరో బైకు నుంచి మంటలు చెలరేగాయి. ఆ బైక్‌పై ఉన్న వ్యక్తి తలకి తీవ్రమైన గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. త‌న‌ శరీరం కాలిపోతున్నా సాయం చేయ‌మ‌ని అడ‌గ‌లేని ప‌రిస్థితిలో ఉన్నాడు. 
 
ఈ ప్ర‌మాద ఘ‌ట‌న అనంత‌రం అత‌డి చుట్టూ చేరిన స్థానికులు, మంటల్లో కాలిపోతోన్న ఆ వ్య‌క్తిని చూస్తూ ఉండిపోయారు. అంతేకాదు, మంట‌ల్లో కాలిపోతోన్న ఆ వ్యక్తిని సినిమా చూస్తున్నట్లు చూస్తూ.. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. దీంతో ఆ వ్య‌క్తి స‌జీవద‌హ‌నం అయ్యాడు. ఇంతలో ఘటనాస్థలానికి పోలీసులు వచ్చారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మందు బాటిల్స్ బైకులపై తీసుకెళ్లడంతోనే మంటలు వ్యాపించాయని పోలీసులు చెప్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

13 యేళ్ళ బాలికపై పాస్టర్ అత్యాచారం... 40 యేళ్ళ జైలుశిక్ష

కేరళ రాష్ట్రంలోని త్రిశూర్‌లో 13 యేళ్ళ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ అఘాయిత్యానికి ...

news

పాయల్ వెడ్డింగ్ రిసెప్షన్ డ్యాన్స్.. షారూఖ్ పాటకు వధువు చిందులు.. వీడియో వైరల్

పెళ్ళిళ్లలో వధూవరులు డ్యాన్స్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇటీవల ఓ వధువు తన కుటుంబం, ...

news

కమ్యూనిస్టులతో పవన్ ప్రయాణం లాభాన్నిస్తుందా...!

సినీనటులు రాజకీయాల్లోకి రావడం కొత్తమే కాదు. దివంగత నేత నందమూరి తారకరామారావు నుంచి జూనియర్ ...

news

అల్లరి భరించలేక.. క్లాస్‌రూమ్‌లో కొడుకు పక్కనే కూర్చున్న తండ్రి.. ఎక్కడ?

కొడుకు చదువుకుంటున్న క్లాసులోనే తండ్రి కూర్చున్నాడు.. ఎందుకో తెలుసుకోవాలంటే? ఈ స్టోరీ ...

Widgets Magazine