శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (10:30 IST)

యూపీలో లవ్ జిహాదీల బెడద: మొబైల్స్ వద్దు!

ఉత్తరప్రదేశ్‌లో లవ్ జిహాదీల బెడద బెంబేలెత్తింపజేస్తోంది. దీని నుంచి తమ పిల్లలను కాపాడుకునేందుకు ఆయా వర్గాలు చేయని యత్నం లేదనే చెప్పాలి. ఈ క్రమంలో నిన్నటిదాకా ఆ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన మహిళలు, యువతులపై ఆంక్షలు తాజాగా పట్టణాలు, నగరాలకూ పాకాయి. 
 
లవ్ జిహాదీల గాలి సోకకుండా ఉండేందుకు బాలికలు, యువతులకు సెల్ ఫోన్‌లు ఇవ్వరాదని ఆగ్రా వైశ్యులు తీర్మానించారు. దాదాపు వెయ్యి మందికి పైగా ప్రత్యేకంగా భేటీ అయిన ఈ సామాజిక వర్గానికి చెందిన బడా వ్యాపారులు సోమవారం ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
బాలికలు, టీనేజీ యువతుల రక్షణపై అఖిలేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైశ్య ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే రక్షణ కల్పిస్తున్న అఖిలేశ్ సర్కారు మిగిలిన వర్గాల వైపు అసలు దృష్టి సారించడం లేదని ఆరోపించారు.