గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాజ్ , శనివారం, 25 ఫిబ్రవరి 2017 (06:15 IST)

అమెరికాకు ఈమెయిల్ అయితే ఇండియాకు వాట్సప్: ప్రశంసల్లో ముంచెత్తిన బ్రెయిన్

వాట్సప్ రూపంలో ఒక అంతర్జాతీయ ప్రాడక్టును నిర్మించడంలో భారత్ మాకెంతో సాయపడిందని వాట్సప్ సహ వ్యవస్థాపకుడు బ్రెయిన్ యాక్టన్ కొనియాడారు. ఇంకా చెప్పాలంటే వాట్సప్ ఇప్పుడు ప్రపంచస్తాయి ఉత్పత్తి కంటే ఎంతో ఎక్కువ విలువైనదని చెప్పారు.

వాట్సప్ రూపంలో ఒక అంతర్జాతీయ ప్రాడక్టును నిర్మించడంలో భారత్ మాకెంతో సాయపడిందని వాట్సప్ సహ వ్యవస్థాపకుడు బ్రెయిన్ యాక్టన్ కొనియాడారు. ఇంకా చెప్పాలంటే వాట్సప్ ఇప్పుడు ప్రపంచస్తాయి ఉత్పత్తి కంటే ఎంతో ఎక్కువ విలువైనదని చెప్పారు. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సప్ అభివృద్ధిలో భారత్‌దే కీలకపాత్ర అని సంస్థ పేర్కొంది. భారత్‌పైనే దృష్టి పెట్టడానికి తమకు బోలెడు కారణాలున్నాయని బ్రెయిన్ చెప్పారు.
 
ప్రస్తుతం వాట్సప్‌కు ఉన్న వందకోట్ల మంది వినియోగదారుల్లో భారత్ వాటా 15 శాతం. అందుకే భారత్‌ను వాట్సప్‌కు సంబంధించి ఒక ప్రయోగ కేంద్రంగా, బోధనా కేంద్రంగా చూస్తున్నాం. భారత ప్రజలనుంచి మేం చాలా నేర్చుకున్నాం అని ఆక్షన్ తెలిపారు. భారత్‌లో వాట్సప్ 10 భాషల్లో లభ్యమవుతోంది. ఇండియాలో మరింత విస్తృతస్థాయిలో వినియోగదారులను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. 
 
పైగా వాట్సప్‌ను విస్తృతంగా వినియోగించడంలో ఇండియా గణనీయ పాత్ర పోషిస్తోంది. భారతీయుల్లో కొందరు వాట్సప్‌ను దాదాపు 150 సార్లు ఉపయోగిస్తున్నారని యాక్షన్ చెప్పారు. 
 
అమెరికా కంటే ఎక్కువగా భారత్‌లో వ్యాపారంలో, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేయడానికి చాలామంది టెలిఫోన్, టెలిపోన్ నంబర్‌పైనే ఆధారపడుతున్నారు. అదే అమెరికాలో అయితే ఈమెయిల్ ఇతర మెసేజింగ్ ఉత్పత్తులపై ఆధారపడుతున్నారని బ్రెయిన్ చెప్పారు. ఫేస్‌బుక్‌తో సహా అమెరికన్ ఇంటర్నెట్ కంపెనీలకు చైనా దగ్గరవుతోండగా వాట్సప్‌ను కోట్లమంది ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారని తెలిపారు. 
వాట్సప్‌ కొత్త ఫీచర్ అయిన కమర్షియల్ మెసేజ్ ఫీచర్, వాట్సప్  ఫరి బిజినెస్‌ లను ఇతర దేశాలకు తీసుకు వెళ్ళడానికి ముందు భారత్‌లోనే వాటిని పరీక్షిస్తామన్నారు. 
 
పైగా భారత్‌లో కనీసం 3 కోట్ల చిన్న, మధ్యస్తాయి షాపులున్నాయి. యాడ్ రెవెన్యూ జనరేటింగ్ ఫీచర్లను లాంచ్ చేయడానికి ఇండియానే మంచి ప్రయోగ కేంద్రంగా ఉంటుందని బ్రెయిన్ పేర్కొన్నారు అందుకే ఇండియాలోనే తాము అదికంగా పెట్టుబడులు పెడుతున్నామన్నారు. కమర్షియల్ మెసేజింగ్, డిజిటల్ లావాదేవీలు వంటి అంశాలతో మానవ జీవితాన్ని మరింత మెరుగుపర్చడంలో భారత్ నుంచే ఎక్కువగా నేర్చుకోవడాన్ని కొనసాగిస్తామని బ్రెయన్ చెప్పారు.
 
సంగీతం నుంచి, బాలీవుడ్ నుంచి దూరంగా ఉండే విషయంలో కూడా ఇండియానే మాకు పాఠాలు నేర్పిందని, ప్రపంచస్థాయి అవకాశాలకు, సాంస్కృతిక ప్రాధాన్యతలకు మధ్య సమతుల్యత సాధించడం ఎల్లప్పుడూ సమస్యగానే ఉంటుందన్న పాఠాన్ని ఇండియానే నేర్పిందని కూడా బ్రెయన్ తెలిపారు. బాలీవుడ్ తారలు వస్తారు పోతారు, మ్యూజిక్ స్టార్లు వస్తారు వెళతారు ఇది సహజ ప్రక్రియ. కానీ ఎవర్ గ్రీన్ కమ్యూనికేషన్ యుటిలిటీపై దృష్టి పెట్టడమే మా పూర్తి లక్ష్యం అని వాట్సప్ సహ వ్యవస్థాపకులు స్పష్టం చేశారు.