శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (16:43 IST)

భారత్‌ను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ... 75 మంది మృతి!

భారత్‌ను స్వైన్ ఫ్లూ వైరస్ వణికిస్తోంది. శీతాకాలం ముగుస్తుండగా తెలంగాణలో ప్రారంభమైన స్వైన్ ఫ్లూ, అక్కడి నుంచి సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌ను పలకరించింది. ఇంతలో రాజస్థాన్‌లో స్వైన్ ఫ్లూ వైరస్ వెలుగు చూసింది. మరిన్ని రాష్ట్రాలకు స్వైన్ ఫ్లూ విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2009లో మహారాష్ట్రను వణికించిన స్వైన్ ఫ్లూ చాలా కాలం తర్వాత భారత్‌లో విజృంభిస్తుండటం కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. 
 
రాజస్థాన్‌లో 145 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా, కొంత మంది మృత్యువుతో పోరాడుతున్నారు. అలాగే, కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వైరస్ బారిన బడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా కూడా మరో ముగ్గురు బారిన పడ్డారు. అలాగే, 20 మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఇంకోవైపు ఏపీలో స్వైన్ ఫ్లూ బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది. కాగా, దేశ వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 75కు చేరింది.