శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 16 మార్చి 2017 (15:11 IST)

పాకిస్థాన్ పని ఖతం : చుక్క నీరు వెళ్లకుండా నదులపై భారత ప్రాజెక్టుల నిర్మాణం

పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం నేర్పేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు సిద్ధమైంది. ఇందులోభాగంగా, పాకిస్థాన్ గడ్డకి నీరు వెళ్లే అన్ని నదులపై ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్

పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం నేర్పేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు సిద్ధమైంది. ఇందులోభాగంగా, పాకిస్థాన్ గడ్డకి నీరు వెళ్లే అన్ని నదులపై ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 
 
ఈ ప్రాజెక్టుల విలువ 15 బిలియన్ డాలర్లు. తమ దేశానికి వచ్చే నదీ జలాలపై ప్రాజెక్టులు కట్టడం వల్ల నీటి సరఫరా తగ్గుతుందని పాకిస్థాన్ ఇప్పటికే గగ్గోలు పెడుతోంది. కానీ, పాక్ హెచ్చరికలను భారత్ ఏమాత్రం పట్టించుకోవడంలేదు. నదీ జలాల పంపిణీ అన్నది భారత వ్యతిరేక ఉగ్రవాదులను నిర్మూలించడం అనే షరతుపైనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో దాయాది దేశానికి తేల్చి చెప్పారు. 
 
నిజానికి భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదమూకలను పెంపి పోషిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఉగ్రవాదులకు అడ్డుకట్ట వేయాలని భారత్ ఎప్పటి నుంచో కోరుకుంటోంది. కానీ, పాకిస్థాన్ పాలకులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో జమ్మూకాశ్మీర్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే నదీ జలాలపై విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. దీంతో పాకిస్థాన్‌ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. 
 
ఎందుకంటే బ్రహ్మపుత్ర, దాని ఉప నదులపై ఆధారపడి పాకిస్థాన్‌లో 80 శాతం సాగు భూముల్లో పంటలు పండుతున్నాయి. గత మూడు నెలల కాలంలోనే ఆరు జలవిద్యుత్ ప్రాజెక్టులు వయబిలిటీ పరీక్షలు నెగ్గాయి. పర్యావరణ, అటవీ అనుమతుల ప్రక్రియలో ఉన్నాయి. బ్రహ్మపుత్ర ఉపనది చినాబ్ నదిపై చేపట్టే ఈ ప్రాజెక్టులతో 3,000 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి సామర్థ్యం సమకూరనుంది.