గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 4 మే 2015 (14:26 IST)

లఖ్వీ విడుదలపై ఐరాస జోక్యం : కేంద్ర హోం శాఖ హర్షం

ముంబై ఉగ్రదాడుల సూత్రధారి జకీ ఉర్ రహ్మాన్ లఖ్వీ విడుదల అంశంపై జోక్యం చేసుకుంటామన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కమిటీ హామీ ఇవ్వడాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు స్వాగతించారు. ముంబై 26/11 ఉగ్ర దాడుల కుట్రపన్నిన లఖ్వీని 2008 డిసెంబర్‌లో, 2009 నవంబర్ 25న మరో ఆరుగురిని పాకిస్ధాన్ అరెస్ట్‌చేసింది. ఆరోజు నుంచి జైలులో ఉన్న లఖ్వీ తదితరులను విడుదల చేయాలని ఏప్రిల్ తొమ్మిదో తేదీన పాకిస్థాన్‌లోని న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే.
 
దీంతో ఏప్రిల్ 11న రావల్పిండిలోని అడియాల జైలు నుంచి విడుదలయ్యారు. లఖ్వీని విడుదల చేయడంతో ఉగ్రవాదాన్ని అణచివేస్తామని పాకి‌స్ధాన్ ఇచ్చిన హామీ గాల్లో మాటలాగే ఉందని భారత్ ఆరోపించింది. జైలుల్లో ఉన్న లఖ్వీని విడుదల చేయడం అంతర్జాతీయ నిబంధనను ఉల్లంఘించడమేనని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ యూఎన్‌ఎస్సీ ఆంక్షల కమిటీ చైర్మన్ జిమ్ మిక్‌లేకు ఐరాసలో భారత రాయబారి అశోక్ ముఖర్జీ లేఖరాశారు. భారత్ ఆందోళనను పరిగణనలోకి తీసుకున్నామని, అందుకే ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి జకీ ఉర్ రహ్మాన్ లఖ్వీ విడుదల అంశంపై జోక్యం చేసుకుంటామని భారత్‌కు ఐక్యరాజ్య సమతి భద్రతా మండలి కమిటీ హామీ ఇచ్చింది.