Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సర్జికల్‌ స్ట్రైక్స్‌తో విరుచుకుపడిన ఇండియన్ ఆర్మీ...

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (16:24 IST)

Widgets Magazine
indian  jawan

ఇండియన్ ఆర్మీ మరోమారు సర్జికల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడింది. ఈ దఫా మాత్రం పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల శిబిరాలపై కాదు. నాగా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఇండో- మయన్మార్‌ సరిహద్దుల్లో మెరుపుదాడులు చేసింది. ఇండియన్‌ ఆర్మీకి చెందిన 70 మంది పారా కమాండోల బృందం బుధవారం ఉదయం 4.45 గంటలకు ఈ దాడి నిర్వహించింది. 
 
ఈ దాడిలో లాంఖూ గ్రామ సమీపంలో ఉన్న నాగా తీవ్రవాదుల శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఈ మెరుపుదాడుల్లో ఎన్‌ఎస్‌సీఎన్‌-కే ఉగ్రమూకకు భారీ నష్టం వాటిల్లినట్టు సైన్యం ప్రకటించింది. పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయినట్టు చెప్పింది. అయితే, సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపిన కమాండోలు అంతర్జాతీయ సరిహద్దు దాటలేదని స్పష్టంచేసింది. 
 
ఎస్‌ఎస్‌ ఖప్లాంగ్‌ నేతృత్వంలో ఏర్పడిన ఎన్‌ఎస్‌సీఎన్‌-కే తిరుగుబాటుదళం.. నాగాల్యాండ్‌, మణిపూర్‌ల్లో మన జవాన్లపై వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో.. సైన్యం సర్జికల్‌ స్ట్రైక్స్‌తో విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఈ తరహా మెరుపుదాడులు నిర్వహించి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో తాజాగా ఇండో మయన్మార్‌ సరిహద్దుల్లో భారత ఆర్మీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తమిళనాడులో ఉద్రిక్తత.. కరుణానిధి ఆరోగ్యం క్షీణించింది.. అమ్మ నైట్ డ్రెస్‌లో వుండటంతో?

తమిళనాడులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం క్షీణించింది. ...

news

రాజకీయనేత నిజాయితీగా ఉంటే ఎన్నో కష్టాలు : రాహుల్ గాంధీ

'నిజాయితీగల రాజకీయ నేతగా ఉండటమే భారత్‌లో అత్యంత కష్టమైన పని. నిజాయితీ ఉంటే ఎన్నో ...

news

రైతుల్లా నటిస్తున్నారు.. వాళ్లే టార్గెట్.. పాక్ సరిహద్దుల్లో "ఆపరేషన్ అర్జున్"

పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు బీఎస్ఎఫ్ సరికొత్త ఆపరేషన్ ప్రారంభించింది. దీనికి కోడ్ ...

news

రెడీ.. వన్.. టు.. త్రీ... కిమ్‌పై సైనిక చర్యకు సిద్ధం : డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గర్జించారు. ప్రపంచ దేశాలను ధిక్కరిస్తున్న ఉత్తర ...

Widgets Magazine