Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత ఆర్మీలో ఇక మహిళలు- యుద్ధరంగంలో ఇక నారీమణులు

సోమవారం, 5 జూన్ 2017 (10:30 IST)

Widgets Magazine
indian army

భారత ఆర్మీలో ఇక మహిళలు తుపాకీలు పట్టనున్నారు. అన్నీ రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తున్న మహిళలు.. ఇకపై ఆర్మీలోనూ తమ సత్తా చాటనున్నారు. ప్రస్తుతం ఆర్మీలోని మెడికల్, లీగల్, ఎడ్యుకేషనల్, సిగ్నల్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో మహిళలను నియమిస్తున్నా యుద్ధ రంగంలోకి మాత్రం వారిని ఇంకా అనుమతించడం లేదు. 
 
గతేడాది భారత వాయుసేనలోకి మహిళలు ప్రవేశించి చరిత్ర సృష్టించారు. ముగ్గురు మహిళలు అవని చతుర్వేది, భావన కాంత్, మోహన సింగ్‌లు ఫైటర్ పైలట్లుగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన  సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చారిత్రక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. త్వరలో కదన రంగంలో మహిళలు కాలుపెట్టనున్నారు. మహిళలను యుద్ధ రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెప్పుకొచ్చారు. 
 
త్వరలోనే మిలటరీ పోలీస్‌లోకి మహిళలను తీసుకుంటామని పేర్కొన్నారు. మహిళలను జవాన్లుగా చూడాలనుకుంటున్నానని.. త్వరలోనే ఆ కల సాకారం కానున్నట్లు రావత్ చెప్పారు. మహిళలను తొలుత మిలటరీ పోలీస్ జవాన్లుగా తీసుకుంటామని చెప్పారు. జర్మనీ, ఆస్ట్రేలియా, కెనా, అమెరికా, బ్రిటన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఆర్మీలో మహిళా జవాన్లను కలిగివున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆంబులెన్స్‌ లేకపోవడంతో బైక్‌పై మృతదేహాన్ని తరలించిన వ్యక్తి.. ఎక్కడ?

ప్రైవేట్ వాహనానికి డబ్బులు కట్టే స్తోమత లేకపోవడంతో ఓ భర్త తన భార్య మృతదేహాన్ని బైక్‌పై ...

news

యూపీలో ఖాకీల ఓవరాక్షన్.. మైనర్ బాలికలపై స్టేషన్లోనే వేధింపులు.. నెట్లో వీడియో

రక్షించాల్సిన ఖాకీలే వేధింపులకు గురిచేశారు. ఆకతాయిల నుంచి రక్షించాల్సిందిగా పోలీసులను ...

news

సేమ్ సీన్: గంటలో పెళ్లి.. డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన వరుడు గుండెపోటుతో మృతి...

పెళ్లి వూరేగింపులో డ్యాన్స్‌ చేస్తున్న పెళ్లికొడుకు ఇటీవల గుజరాత్‌లో మరణించిన సంగతి ...

news

కార్పొరేషన్ అధికారులపై గేదెలతో దాడి చేయించారు.. పోలీసులను రాళ్లతో కొట్టారు..

మధ్యప్రదేశ్‌లో కార్పొరేషన్ అధికారులపై గేదేలతో దాడి చేయించారు.. పాల వ్యాపారాలు. ఈ ఘటనలో 12 ...

Widgets Magazine