శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 4 అక్టోబరు 2016 (13:35 IST)

6 నెలలు చాలు... పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో ఉగ్రవాదులను లేపేస్తాం... ఒక్కడు కూడా మిగలడు...

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో తిష్ట వేసి ఉన్న ఉగ్రవాదులను మొత్తాన్ని ఏరిపారేసేందుకు ఎంతసమయం కావాలని భారత సైన్యాన్ని అడిగితే... ఆరు నెలల సమయం చాలు.... వారి అంతు చూస్తాం.. ఒక్కడు కూడా మిగలడు. ఉగ్రవాది అనే పేరు లేకుండా చేసేస్తాం అని ఆర్మీ చెప్పినట్లు సమ

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో తిష్ట వేసి ఉన్న ఉగ్రవాదులను మొత్తాన్ని ఏరిపారేసేందుకు ఎంతసమయం కావాలని భారత సైన్యాన్ని అడిగితే... ఆరు నెలల సమయం చాలు.... వారి అంతు చూస్తాం.. ఒక్కడు కూడా మిగలడు. ఉగ్రవాది అనే పేరు లేకుండా చేసేస్తాం అని ఆర్మీ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం సరిహద్దు వెంబడి పాకిస్తాన్ వైపు నుంచి కాల్పుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. 
 
36 గంటల్లో ఆరుసార్లు కాల్పులకు తెగబడ్డారు పాక్ సైనికులు. మరోవైపు నక్కల్లా నక్కి ఉన్న ఉగ్రవాదులు కూడా అవకాశం దొరికినప్పుడల్లా మోర్టార్ దాడులు చేస్తున్నారు. వీరి ఆగడాలను పూర్తిగా అడ్డుకట్ట వేసి వారిని తుడిచిపెట్టాలంటే తమకు కేవలం 6 నెలల సమయం సరిపోతుందని సైన్యం చెప్పినట్లు సమాచారం అందుతోంది. మరోవైపు పాకిస్తాన్ సరిహద్దు రేఖ వెంబడి భారీగా సైనికులను మోహరిస్తుంది. వారి కదలికలన్నీ భారత సైన్యం నిశితంగా గమనిస్తోంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.