శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:35 IST)

బంగారు నాణేలపై అశోక్ చక్రం ముద్ర : అరుణ్ జైట్లీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా కొత్త బంగారు విధానాన్ని జైట్లీ ప్రవేశపెట్టారు. అశోక్ చక్రం ముద్రించిన బంగారు నాణేలను విడుదల చేస్తామన్నారు. 
 
అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. 
* ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ. 5వేల కోట్లు 
* ఐసీడీఎస్‌కు రూ.1500 కోట్ల కేటాయింపు 
* మౌలిక సదుపాయాల కల్పనకు రూ.70వేల కోట్లు 
* రైళ్లు, రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం బాండ్లు. 
* సూక్ష్మ సేద్యం కోసం రూ. 5300 కోట్లు 
* సంవత్సరానికి రూ. 12 ప్రీమియంతో రూ. 2లక్షల ప్రమాద బీమా యోజన 
* అటల్ ఫించన్ యోజన పథకానికి 50 శాతం ప్రభుత్వ సహాయం 
* ఈపీఎఫ్‌లో ఎవరికీ చెందని రూ.3వేల కోట్ల నిధులు వృద్ధుల సంక్షేమం కోసం కేటాయింపు.