గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 27 మే 2015 (06:42 IST)

రామ్ మెహర్@రబ్బర్ మ్యాన్... విరిచేయగలడు జాగ్రత్త..!!

ఆయన పేరు రామ్ మెహర్ ... సాధారణ వ్యవసాయదారుడు.. ప్రత్యేకమైన శక్తులేం లేవు. కానీ ఒళ్ళు విరిచేస్తాడు. మహామహా బలాడ్యులు ఆయన ముందు బలాదూర్... 60 సిడీలను ఒకేమారు తన చేతులు కాదు.. భుజాల మధ్య పెట్టి ఫటా ఫటామంటూ విరిచేయగలడు.. రెండు భుజాలను ఏకం చేయగలడు. గిన్నీస్ బుక్కులో రబ్బర్ మాన్ ఆఫ్ ఇండియాగా స్థానం సంపాదించిన ఈ ధీశాలి గురించిన వివరాలు 
 
 ఊరు హరియాణాలోని పానిపట్ కు చెందిన రామ్‌మెహర్ పునియా(35) వృత్తిరిత్యా వ్యవసాయదారుడు. ఆయనకు వ్యాయం అంటే పిచ్చి. చేసేది సేద్యమే కాబట్టి మరింత కష్టపడి శరీరాన్ని వంచడం మొదలు పెట్టాడు. అలా ఇలా కాదండోయ్ ఆశ్చర్యం కలుగుతుంది. మహామహా యోగా మాస్టర్లు, మల్లయోధులు ఇతని ముందు ఒక రకంగా దిగదుడుపే. శరీరాన్ని మాత్రం రబ్బర్‌లా వంచేయగలడు! అందుకే ‘రబ్బర్ మ్యాన్’గా ప్రశంసలు అందుకుంటున్నాడు. 
 
రెండు భుజాలనూ ఇలా ఛాతీ మీదుగా దగ్గరకు చేర్చి కలపగలడు. అంతే కాదు అదే భుజాల మధ్య ఒక నిమిషంలో 60 సీడీలను ముక్కలు చేయగలడు. భుజాలను కలపడమే సాధ్యం కాదు. మళ్ళీ వాటి మధ్యన సీడీలు ముక్కులు చేయడం కూడానా.. అందుకే గిన్నిస్ బుక్కు నిర్వాహకులు భుజాల మధ్య అత్యధిక సీడీలను పగులగొట్టిన ధీరుడిగా రికార్డూ అందజేశారు. ఇతడు ఎడమ చేతిని తలచుట్టూ తిప్పి ఎడమ చెవి అందుకోగలడు కూడా! శరీరాన్ని రబ్బరులా ఉంచడానికి రోజూ 4 గంటలు కసరత్తులు చేస్తాడట. దట్ ఈజ్ రామ్ మెహర్ @రబ్బర్ మ్యాన్.