గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2017 (11:48 IST)

మూడు దాటితే మృత్యువే... ఆ సమయంలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మధ్యాహ్నం పూటే జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడించాయి. అదీ కూడా మధ్యాహ్నం మూడు గంటల తర్వాతే ఎక్కువగా సాగుతున్నాయని తేలింది.

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మధ్యాహ్నం పూటే జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడించాయి. అదీ కూడా మధ్యాహ్నం మూడు గంటల తర్వాతే ఎక్కువగా సాగుతున్నాయని తేలింది. గత యేడాది దేశవ్యాప్తంగా 4,80,652 రోడ్డు ప్రమాదాలు జరిగితే.. అందులో 85,834 (18 శాతం) ప్రమాదాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటలలోపే జరిగాయని కేంద్ర రహదారులు, హైవేల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. 
 
దేశంలో 2005–2016 మధ్యకాలంలో సుమారు 15,50,098 మంది రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయారని ఈ నివేదిక వెల్లడించింది. 2016లో ప్రతి రోజు 1,317 ప్రమాదాలు (ప్రతి గంటకు 55) నమోదయ్యాయని, మొత్తం ప్రమాదాల్లో 1,50,785 మంది ప్రాణాలు కోల్పోయారని (ప్రతి గంటకు 17 మంది లేదా ప్రతి మూడు నిమిషాలకు ఒక మరణం), 4,94,624 మంది క్షతగాత్రులు అయ్యారని పేర్కొంది. ఈ మరణాల్లో 25 శాతం లేదా 38,076 మంది 25 నుంచి 35 ఏళ్ల వయసు మధ్యవారేనని తెలిపింది. 
 
మధ్యాహ్నం తర్వాత ఎక్కువ ప్రమాదాలు జరిగేది సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యనే అని ఈ నివేదిక వెల్లడించింది. 2016లో 6 నుంచి 9 మధ్యలో 84,555 ప్రమాదాలు నమోదయ్యాయని చెప్పింది. 2016లో దేశంలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో 35 శాతం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య జరిగినవే.