శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 28 నవంబరు 2016 (21:29 IST)

వర్షాకాలం పోయి డబ్బులు కురిసే కాలం వచ్చిందా...రోడ్లపై డబ్బు... ఏరుకుంటున్న జనం(ఫోటో)

పెద్దనోట్లు రద్దు పుణ్యమా అని ఇప్పుడు దేశంలో రోడ్లపైనో, చెత్త కుండీల్లోనో, గలగలా పారే ప్రవాహాల్లోనూ డబ్బులు కనిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని జాతీయ రహదారిపై డబ్బు తీసుకెళుతున్న ఓ కంటెయినర్ నుంచి నాణేల డబ్బాలు దొర్లి పడ్డాయి. అందులో నుంచి న

పెద్దనోట్లు రద్దు పుణ్యమా అని ఇప్పుడు దేశంలో రోడ్లపైనో, చెత్త కుండీల్లోనో, గలగలా పారే ప్రవాహాల్లోనూ డబ్బులు కనిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని జాతీయ రహదారిపై డబ్బు తీసుకెళుతున్న ఓ కంటెయినర్ నుంచి నాణేల డబ్బాలు దొర్లి పడ్డాయి. అందులో నుంచి నాణేలు రోడ్డుపై కుప్పలు కప్పలుగా పడిపోయాయి. ఇంకేం... అది చూసిన జనం తట్టలు, బుట్టలు తీసుకొచ్చి ఎత్తుకుని వెళ్లారు.