శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 22 నవంబరు 2014 (16:48 IST)

బూతు చిత్రాలను చూస్తున్న యూత్... ఉత్తరాది కుర్రాళ్ల కంటే ఆంధ్ర కుర్రాళ్లే....

ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన తర్వాత దానితో ప్రయోజనాలే కాదు... అది వెర్రితలలు వేస్తూ పోర్న్ సైట్లు రూపంలో యువతను పెడదోవ పట్టిస్తోంది. ఇలా నెట్ అనేది దుర్వినియోగం అవుతోంది. ముఖ్యంగా యువత ఇంటర్నెట్లో నీలి చిత్రాలను చూసేందుకు ఎగబడుతున్నట్లు తాజాగా ఓ బూతు వెబ్ సైట్ చేపట్టిన సర్వేలో తేలిందట. ప్రపంచంలో సగటున కుర్రకారు రోజుకు దాదాపు 9 నిమిషాలను బూతు చిత్రాలు చూసేందుకు కేటాయిస్తున్నట్లు వారి సర్వేలో తేలిందట. 
 
అలాగే మన భారతదేశానికి వస్తే... ఇక్కడి యువత సగటున ఎనిమిదిన్నర నిమిషాలు చూస్తూ ప్రపంచ సగటుకు తీసిపోకుండా ఉన్నట్లు తేల్చింది. భారతదేశంలో ఉత్తరాది కుర్రాళ్లు ప్రపంచ సగటు కంటే మూడాకులు ఎక్కువే చదివారట. వారి సగటు 12 నిమిషాలు ఉన్నట్లు తేలింది. ఐతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కుర్రాళ్లు మాత్రం 5 నిమిషాలను ఈ పోర్న్ సైట్లు చూసేందుకు కేటాయిస్తున్నారట. అందులోనూ ఎక్కువగా సన్నీ లియోన్ ను చూసేందుకు అధిక సమయం కేటాయిస్తున్నారని ఆ సైట్ వెల్లడించింది.