శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 29 జులై 2015 (17:03 IST)

ఇద్దరు భారతీయులకు ప్రతిష్టాత్మక రామన్‌ మెగాసెసే అవార్డు

భారతీయుల్లో ఇద్దరికి అరుదైన గౌరవం దక్కింది. ఈ యేడాది ప్రతిష్టాత్మక రామన్‌ మెగాసెసే అవార్డును ఐదుగురికి ప్రకటించారు. వీరిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. 
 
వీరిలో ఎయిమ్స్‌ డిప్యూటీ సెక్రటరీ సంజీవ్‌ చతుర్వేది, గూన్జ్‌ స్వచ్చంధ సంస్థ వ్యవస్థాపకుడు అన్షూ గుప్తాలు ఉన్నారు. ఎయిమ్స్‌ కుంభకోణాలను సంజీవ్‌ చతుర్వేది బయట్టినందుకు, ఆయన ధైర్యాన్ని మెగాసెసే ఫౌండేషన్‌ మెచ్చుకుంది. 
 
అలాగే, పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న అన్షూ గుప్తాకు.. సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు చూసిఅవార్డు ప్రకటించినట్లు మెగాసెసే ఫౌండేషన్‌ తెలిపింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ప్రతియేటా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటిస్తుంది.