శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (12:32 IST)

నదులపై డ్యామ్ మీద డ్యామ్ నిర్మించేలా భారత్ ప్లాన్.. తల్లడిల్లిపోతున్న పాకిస్థాన్

ముష్కరమూకలను ప్రేరేపిస్తూ రెచ్చిపోతున్న పాకిస్థాన్‌ దూకుడుకు కళ్లెం వేసేలా భారత్ ప్లాన్ వేస్తోంది. ఇందులోభాగంగా, ఇరు దేశాల మధ్య ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకునే దిశగా భారత ప్రభుత్వం అడుగ

ముష్కరమూకలను ప్రేరేపిస్తూ రెచ్చిపోతున్న పాకిస్థాన్‌ దూకుడుకు కళ్లెం వేసేలా భారత్ ప్లాన్ వేస్తోంది. ఇందులోభాగంగా, ఇరు దేశాల మధ్య ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకునే దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంతటితో ఆగని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం... పాక్  వెన్నులో వణుకు పుట్టించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. 
 
ఇందులోభాగంగా, హిమాలయాల్లో పుట్టి రెండు దేశాల్లో ప్రవహించే నదుల నుంచి పాకిస్థాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలువరిస్తే సరిపోతుందని నిపుణులు ఇస్తున్న సలహాలపై భారత ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తోంది. ఈ దిశగా 1960లో కరాచీ వేదికగా కుదుర్చుకున్న 'ఇండస్ ఒప్పందం'ను రద్దు చేయాలని, రెండు దేశాల అధికారులూ ఉన్న ఇండస్ వాటర్ కమిషన్‌ను సస్పెండ్ చేయాలని సూచిస్తున్నారు. 
 
నాడు కుదిరిన ఒప్పందంలో భాగంగా రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్‌కు, ఇండస్, జీలం, చీనాబ్ నదులు పాకిస్థాన్‌కు దక్కాయి. ఇవన్నీ భారత్ మీదుగా, పాకిస్థాన్‌కు ప్రవహించే జీవ నదులు. ఇక ఈ నదుల ప్రవాహం, పాకిస్థాన్‌లోని పలు జిల్లాలను సస్యశ్యామలం చేసి అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ఈ ఒప్పందం రద్దు చేస్తున్నామన్న ఒక్క మాట భారత్ నోటి వెంట వస్తే, పాక్ పాలకులపై అమితమైన ఒత్తిడి పడుతుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైజెస్ ఉన్నతాధికారి ఉత్తమ్ సిన్హా అభిప్రాయపడ్డారు.