శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (09:45 IST)

ఇంద్రాణికి మూర్ఛరోగం.. మోతాదుకు మించి మాత్రలు మింగడం వల్లే అస్వస్థత?

కన్నకుమార్తె షీనా బోరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన ప్రధాన ముద్దాయి ఇంద్రాణి ముఖర్జియా మూర్ఛరోగం (ఫిట్స్)తో బాధపడుతున్నారు. ఫిట్స్ నిరోధానికి ఆమె జైలు అధికారుల పర్యవేక్షణలోనే ప్రతి రోజూ ఉదయం ఒకటి, సాయంత్రం ఒకమాత్ర చొప్పున మింగుతున్నారు. కానీ, జైలు అధికారుల కన్నుగప్పి ఆమె అధిక మోతాదులో ఈ మాత్రలను మింగడం వల్ల ఆమె తీవ్ర అస్వస్థతకులోనై ఆస్పత్రి పాలైనట్టు వార్తలు వస్తున్నాయి. 
 
2012లో షీనాబోరా అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, ఆర్థిక కారణాల వల్లే ఇంద్రాణి ముఖర్జీ తన సొంత కూతురైన షీనాను చంపేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మాజీ భర్త సంజీవ్ ఖన్నా కలిసి ఇంద్రాణీయే కుమార్తె షీనాను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్, ఆమె కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసి కస్టడీలో ఉంచారు. ప్రస్తుతం ఈ కేసుపై సీబీఐ విచారణ సాగుతున్న విషయంతెల్సిందే.