శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2018 (12:17 IST)

ఈశాన్య రాష్ట్రాల్లో అస్థిరతకు చైనా, పాక్ పక్కా ప్లాన్ వేస్తున్నాయ్: ఆర్మీ చీఫ్

ఈశాన్య రాష్ట్రాల్లో అస్థిరత నెలకొనేలా చేయడమే చైనా, పాకిస్థాన్ లక్ష్యమని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లోకి బంగ్లాదేశీయుల అక్రమ వలస పెరుగుతున్న నేపథ్యంలో.. పక్కా ప్రణాళికతోనే

ఈశాన్య రాష్ట్రాల్లో అస్థిరత నెలకొనేలా చేయడమే చైనా, పాకిస్థాన్ లక్ష్యమని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లోకి బంగ్లాదేశీయుల అక్రమ వలస పెరుగుతున్న నేపథ్యంలో.. పక్కా ప్రణాళికతోనే చైనా సాయంతో పాకిస్థాన్ బంగ్లాదేశీయుల వలసలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. 
 
దీనిపై ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. అసోంలో ముస్లింల జనాభా అమాంతం పెరిగిపోతుండటంపై కూడా స్పందించిన ఆర్మీ చీఫ్ అసోంలో బీజేపీ కంటే ఏఐయూడీఎఫ్ అనే ముస్లిం పార్టీ వేగం ఎదుగుతుందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించగలుగుతామని చెప్పారు. 
 
ఇదిలా ఉంటే.. చైనాతో పాకిస్థాన్ దేశానికి ఉన్న సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. పాకిస్థాన్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న అధికారిక భాషలు ఉర్దూ, అరబిక్, ఆంగ్లం మాత్ర‌మే. ప్రస్తుతం ఈ జాబితాలో మాండరిన్ భాష కూడా చేరింది. ఎలాగంటే..? మాండరిన్‌కు అధికార భాష హోదాను కల్పిస్తూ పాకిస్థాన్ సేనెట్‌లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 
 
పాక్, చైనా మధ్య సంబంధాలు నేపథ్యంలో ఈ తీర్మానం అవసరమని పాక్ ప్రకటించింది. మాతృభాషలు కానటువంటి ఇంగ్లీష్, ఉద్దూ, ఆరబిక్ భాషలకు జతగా ఇప్పుడు మాండరిన్ తోడైందని పాక్ అంబాసిడర్ హుస్సేన్ ట్వీట్ చేశారు.