శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (20:27 IST)

పిల్లలు కావాలా...! సరగోసీ ఫ్యాక్టరీకి వెళ్లండి. ‘కని’ చేతిలో పెడతారు. ఎక్కడ?... ఎలా..?

మీకు గర్భం దాల్చడం ఇష్టం లేదు. కానీ పిల్లలు కావాలి... లేదా మీకు పిల్లలు పుట్టడం లేదు. పిల్లలంటే ఇష్టం.. మీ జన్యువులు కలిగిన పిల్లలే కావాలి. ఇంకెందుకు ఆలస్యం సరగోసీ ఫ్యాక్టరీకి బయలుదేరండి.. అక్కడ కోరుకున్న గర్భం అద్దెకు దొరుకుతుంది. కోరుకున్న రీతిలో పిల్లాడ్ని కని మీ చేతిలో పెట్టేస్తారు. ఎక్కడా ఎలా అని అనుకుంటున్నారు కదూ.. మరెక్కడో కాదు దేశ రాజధాని ఢిల్లీ చుట్టూ సరగోసీ ఫ్యాక్టరీనే ఒకటి ఏర్పాటయ్యింది. ఎలా సాధ్యం..? రండీ తెలుసుకుందాం. 
 
పేదిరికాన్ని తరిమివేయడమే తన నినాదం అని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వమైనా నేటీ మోదీ ప్రభుత్వమైనా... ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వమైనా ఒకటే నినాదం పేదిరకాన్ని పారద్రోలుదాం.. అయ్యిందా... అంటే అవుతూనే ఉంటుంది. రాజధాని చుట్టూ తమ కుటుంబాలను పోషించుకోవడానికి గర్భసంచుల ఫ్యాక్టరీనే ఒకటి రూపొందిందంటే అక్కడ పేదిరికం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్సీఆర్ పరిధిలో పేదరికం, అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితులతో  సతమతమవుతున్న కార్మిక వర్గాలకు చెందిన మహిళలను కొంతమందిని గుర్తించి..  పిల్లలను కని ఇస్తే డబ్బు చెల్లిస్తామని చెప్పడంతో వాళ్లిలా యంత్రాల్లా పిల్లలలను  కనేసి ఇస్తున్నారు. 
 
అనారోగ్యంతో బాధ పడుతున్న పిల్లవాడి చికిత్సకు కావలసిన ఆర్థిక సాయం కోసం ఒకరు, భర్త కుటుంబాన్ని పట్టించుకోక పోవడంతో  కుటుంబాన్ని పోషించుకోవడానికి అవసరమైన నాలుగు రూకల కోసం మరొకరు.. ఇలా రకరకాల సామాజిక సమస్యలతో బాధపడుతున్న మహిళలు వాళ్ల అవసరాల కోసమే ఈ పనికి ఒప్పుకుంటున్నారు. ఇందుకు వీళ్లకు రెండు నుంచి మూడు లక్షల రూపాయల దాకా చెల్లిస్తారు. ఒకవేళ ఆ అద్దె అమ్మ కనుక కవలలకు జన్మనిస్తే ఆమెకిచ్చే డబ్బు కూడా రెట్టింపులో చెల్లిస్తారు. ఇలా అద్దె ప్రాతిపదికన అమ్మలను అరేంజ్ చేసేందుకు ఢిల్లీలోని నోయిడా, గూర్గావ్ తదితర ఇండస్ట్రియల్ ఏరియాల్లో సరోగేటరీ కన్సల్టెన్సీలు కూడా వెలిశాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
 
ఇందుకోసం ప్రత్యేక హబ్‌‌లను నడుపుతున్నారు. ఆయా ఏరియాల్లో సర్వే చేసి అద్దె ప్రాతిపదికన పిల్లలను కనేందుకు ఆసక్తి కలిగిన వివాహిత మహిళలను గుర్తిస్తారు. పిల్లలను కనేందుకు అమ్మలను ఎంపిక చేసిన దగ్గరనుంచి వారి ఆరోగ్యం గురించి, ట్రీట్‌మెంట్‌ గురించి సంబంధిత కన్సల్టెన్సీయే బాధ్యత తీసుకుంటుంది. అంతేకాదు, డెలివరీ కోసం మంచి హాస్పిటల్‌లో చేర్చే బాధ్యత కూడా వాళ్ళదే. అంతేకాకుండా వంధ్యత్వానికి గురై పిల్లలను కనలేని మహిళలకు ఇది మంచి అవకాశంగా భావించవచ్చంటున్నారు డాక్టర్లు.