నేను లావయ్యానా.. ఇవేం మాటలండి బాబూ.. వసుంధర రాజే

Last Updated: శుక్రవారం, 7 డిశెంబరు 2018 (18:02 IST)
లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీ నేత శరద్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తీవ్రంగా స్పందించారు. తాను లావయ్యానంటూ శరద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై వసుంధర రాజే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శరద్ వ్యాఖ్యలు మొత్తం మహిళలను అవమానించినట్లున్నాయని.. తనను బాధించాయని వసుంధర రాజే ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఈ నెల ఐదో తేదీన శరద్ యాదవ్ ప్రచారం చేస్తూ సీఎం వసుంధర రాజే శరీరాకృతిపై శరద్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వసుంధరా రాజే రోజు రోజుకూ లావైపోతున్నారని.. ఆమె ఇక విశ్రాంతి తీసుకోవడమే మంచిదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 
 
దీనిపై వసుంధర రాజే మాట్లాడుతూ.. శరద్ వ్యాఖ్యలతో తాను చాలా అవమానానికి గురైయ్యానని.. శరద్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను వసుంధర డిమాండ్ చేశారు.దీనిపై మరింత చదవండి :