శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 29 జులై 2016 (12:01 IST)

కర్నాటక రాష్ట్రం ఆ విషయంలో 'పులి': మీకే చెప్తుందీ... పులిని కాపాడదాం రండీ... ప్రకాష్ రాజ్

మనం ఎవరి గురించైనా గొప్పగా చెప్పాలంటే... వాడు పులి లాంటివాడు అని చెప్పేస్తుంటాం. ఇప్పుడు కర్నాటక రాష్ట్రం పరిస్థితి కూడా అలాగే మారింది. #internationaltigerday సందర్భంగా ఆ రాష్ట్రం గర్వపడే విషయం రికార్డయ్యింది. అదేమిటయ్యా అంటే దేశం మొత్తమ్మీద కర్నాటక

మనం ఎవరి గురించైనా గొప్పగా చెప్పాలంటే... వాడు పులి లాంటివాడు అని చెప్పేస్తుంటాం. ఇప్పుడు కర్నాటక రాష్ట్రం పరిస్థితి కూడా అలాగే మారింది. #internationaltigerday సందర్భంగా ఆ రాష్ట్రం గర్వపడే విషయం రికార్డయ్యింది. అదేమిటయ్యా అంటే దేశం మొత్తమ్మీద కర్నాటక రాష్ట్రంలో ఉన్న పులుల సంఖ్య మరే ఇతర రాష్ట్రంలోనూ లేదట. కర్నాటకలో ప్రస్తుతం వీటి సంఖ్య 406గా ఉన్నట్లు వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఇండియా వెల్లడించిన గణాంకాలు చెపుతున్నాయి. 
 
దేశంలో అత్యధిక పులులున్న రాష్ట్రంగా కర్నాటక రికార్డు సృష్టిస్తోంది. పులుల సంఖ్యను గణనీయంగా పెంచే దిశలో కర్నాటక తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయంటూ ప్రశంసలను సైతం దక్కించుకుంటోంది కర్నాకట. ఎంఎం హిల్స్, కావేరి వైల్డ్ లైఫ్ శాంక్చురీల్లో పులుల సంఖ్య మెరుగుపడుతున్నట్లు తెలుస్తోందంటున్నారు.  
 
సైంటిఫిక్ ఎనాలసిస్ ప్రకారం 1933 చదరపు కి.మీ పరిధిలో సి.సి. కెమేరాలతో పరిశీలించగా 14 పులులు కంటబడ్డాయి. 12 పులులు ఎంఎం హిల్స్ వద్ద తిరుగుతూ కనబడగా మరో రెండు పులులు కావేరి వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనబడ్డాయి. వచ్చే ఐదేళ్లలో కర్నాటకలో పులుల సంఖ్య 800కి చేరుకునే అవకాశం ఉన్నట్లు అధ్యయనకారులు చెపుతున్నారు. మరోవైపు #SaveTigers నినాదంతో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పులులను సంరక్షించాలంటూ పిలుపునిస్తున్నారు.