శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (14:42 IST)

నేనే పోయాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత..! జయ వైరాగ్యమే కొంపముంచిందా?

అప్రతిహతంగా పాతికేళ్లు తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన బలమైన పార్టీ అన్నాడిఎంకే ఇప్పుడు ఆ బలాన్నే కోల్పోయి విలవిల్లాడుతోందా? ఆ బలం జయలలిత అయితే ఆమెలేని పార్టీ ఇప్పుడు నాయకత్వ లేమితోనే చీలిక బాట పట

అప్రతిహతంగా పాతికేళ్లు తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన బలమైన పార్టీ అన్నాడిఎంకే ఇప్పుడు ఆ బలాన్నే కోల్పోయి విలవిల్లాడుతోందా? ఆ బలం జయలలిత అయితే ఆమెలేని పార్టీ ఇప్పుడు నాయకత్వ లేమితోనే చీలిక బాట పట్టడమే కాదు. కేంద్రం ఆడే జూదంలో పాచికలా మారుతోంది. తాను ఉన్నంతవరకు పార్టీలో పై స్థాయి నుంచి కిందివరకు తేడా లేకుండా అందరినీ పాదాక్రాంతులను చేసుకున్న జయలలిత తన తర్వాత ఎవరు అనే విషయం ఏమాత్రం పట్టించుకోకపోవడమే అంత పెద్ద, బలమైన పార్టీని అనాథగా మార్చేసిందా.. వ్యక్తి పూజతో మొదలై వ్యక్తి పూజతోనే అంతమయ్యే పార్టీల పతనానికి అన్నాడీఎంకే అతిపెద్ద నమూనా అని పరిశీలకులు అంటున్నారు. 
 
జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీలో గందరగోళం నెలకొంది. ప్రాంతీయ పార్టీల అధినేతలు తమ వారసులను ప్రకటించకపోతే ఏమి జరుగుతుందో తమిళనాడులో ఇప్పుడు అదే జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు మరణించిన జయలలిత, తన వారసులను ప్రకటించకపోవడంతో కుర్చీ పోరు మొదలైంది. అమ్మ లేకపోతే తాము లేమని శోకాలు పెట్టినవారే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం కత్తులు దూసుకుంటున్నారు. అధికారం దక్కించుకోవడం కోసం మాత్రమే అమ్మ పేరు వాడుకుంటున్నారు. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకమని కవి సినారె అన్నట్టుగానే అన్నాడీఎంకేలోని పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
 
‘‘నేనే లేని ఈ లోకంలో ఏమి జరిగితే నాకెందుకు? అందుకే నాకంటూ వారసులను ఎవరినీ ప్రకటించడం లేదు’’ ఆస్పత్రిలో చేరడానికి ముందు దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒకరి వద్ద వ్యక్తంచేసిన అభిప్రాయం ఇది! జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, అవహేళనలు, ఛీత్కారాలు చవిచూసిన జయలలిత ఇటువంటి అభిప్రాయం వ్యక్తంచేయడం సమంజసమే కావచ్చు. అందుకే అపరిమిత అధికారాన్ని, ఆస్తులను వదిలేసి ఆమె ఒంటరిగానే ఈ లోకం విడిచి వెళ్లారు. ఫలితంగా తమిళనాడులో ఏమి జరుగుతున్నదో ఇప్పుడు చూస్తున్నాం. 
 
జయలలిత ప్రకటించకపోయినా అటు శశికళ, ఇటు పన్నీర్‌ సెల్వం ఎవరికి వారే తాము జయలలితకు వారసులమని ప్రకటించుకుని అధికారం అందుకోవడానికి తహతహలాడుతున్నారు. జయలలితకు సన్నిహితురాలిగా శశికళ ఎలా? ఎందుకు? ఉన్నారో తెలియదు. శశికళతో అంత సాన్నిహిత్యాన్ని జయలలిత ఎందుకు కోరుకున్నారో తెలియదు. మధ్యలో కొద్ది రోజులు మినహా దాదాపు మూడు దశాబ్దాల పాటు తనతోనే ఉన్న శశికళను తన వారసురాలిగా జయలలిత ఎన్నడూ ప్రకటించకపోగా సూచనప్రాయంగా కూడా ఎవరి వద్దా పేర్కొనలేదు.
 
కోర్టు తీర్పుల కారణంగా అధికారం నుంచి తప్పుకోవలసి వచ్చిన సందర్భాలలో కూడా పన్నీర్‌ సెల్వానికే ఆమె అధికారం అప్పగించారు కానీ, మరొకరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టలేదు. జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీలో గందరగోళం నెలకొంది. ప్రాంతీయ పార్టీల అధినేతలు తమ వారసులను ప్రకటించకపోతే ఏమి జరుగుతుందో తమిళనాడులో ఇప్పుడు అదే జరుగుతోంది. డీఎంకే అధినేత కరుణానిధి తన వారసుడిగా కుమారుడు స్టాలిన్‌ను ప్రకటించడంతో ఆ పార్టీ కొత్త నాయకత్వం చేతుల్లోకి వెళ్లింది. అధికారంలో ఉన్నప్పుడు మరణించిన జయలలిత, తన వారసులను ప్రకటించకపోవడంతో కుర్చీ పోరు మొదలైంది. తమిళనాడు రాజకీయాలు వ్యక్తి పూజతో మొదలై వ్యక్తి పూజతోనే అంతమవుతాయి.